Iphone: రూ.30 నుంచి 50 వేల వరకు భారీగా తగ్గనున్న ఐఫోన్ ధరలు.. వివరాలివే?

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో

  • Written By:
  • Publish Date - December 3, 2022 / 07:30 AM IST

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలా మంది యాపిల్ బ్రాండ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా యాపిల్ బ్రాండ్లో ఐఫోన్స్ కి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. యాపిల్ సిరీస్ లో కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి అంటే చాలు వెంటనే ఆ ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి యాపిల్ ఫోన్ ఇష్టం ఉన్నా కూడా దాని ధరని చూసి వెనుకడుగు వేస్తూ ఉంటారు. యాపిల్ ఫోన్లు అధునాతన ఫీచర్లు ఉండడంతో పాటుగా ధరలు కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఉంటాయి.

ఐఫోన్‌ కొనాలంటే రూ. లక్షలు పెట్టాల్సిందే. ఇది ఇలా ఉంటే యాపిల్ వినియోగదారులకు శుభవార్త. అదేమిటంటే భారత్‌లో రానున్న రోజుల్లో యాపిల్ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎందుకంటె కారణం భారత్‌లో ఐఫోన్‌ లు తయారీ మొదలుకానున్నాయి. ప్రముఖ దేశీయ వ్యాపార దిగ్గజ సంస్థ అయిన టాటా భారత్‌లో యాపిల్‌ ఫోన్‌లను తయారు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తులను ప్రారంభించింది. స్థానికంగా ఫోన్‌ల తయారీ జరిగితే దేశంలో యాపిల్‌ ఫోన్‌ల ధరలు భారీగా తగ్గనున్నాయట. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న ఐఫోన్‌ తయార్‌ ప్లాంట్‌ను టాటా కొనుగోలు చేయాలని భావిస్తోంది.

కాగా దాని విలువ దాదాపు రూ. 5000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఉన్న విస్ట్రాన్‌ కంపెనీకి చెందిన ప్లాంట్‌లో ఇప్పటికే ఐఫోన్‌ ల తయారీ మొదలైంది. కాగా తైవాన్ దిగ్గజ కంపెనీలైన విస్ట్రోన్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూపు భారత్‌లోని చెన్నైలో ఐఫోన్లను తయారుచేస్తోంది. టాటా గ్రూప్ విస్ట్రోన్‌ తో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఈ డీల్‌ కనుక ఓకే అయితే టాటా కంపెనీ అరుదైన గౌరవం దక్కించుకోనుంది. ఐఫోన్లను తయారుచేయనున్న తొలి భారత కంపెనీగా కూడా అవతరించనుంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరి టాటా ఐఫోన్‌లను స్థానికంగా తయారు చేస్తే వాటి ధర భారీగా తగ్గనుంది. ఐఫోన్‌ల ధరలు సుమారు రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు గల కారణం ప్రయాణ ఖర్చులు తగ్గడమే కారణంగా చెబుతున్నారు. దీంతో టాటా, విస్ట్రాన్‌ల మధ్య ఒప్పందం అందరిలోనూ ఆసక్తినెలకొంది.