Site icon HashtagU Telugu

Indian Railway: మీ దగ్గర డబ్బులు లేకపోయినా రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

Eastern Railway RRC ER

Eastern Railway RRC ER

చాలా మందికి రైలులో ప్రయాణించాలి అంటే చాలా ఇష్టం. ఇంకొంతమంది అయితే ఒక్కసారి అయినా రైలులో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించాలి అని అలాగే లగ్జరీగా ఉండే ట్రైన్ లో ప్రయాణించాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ రైలు టికెట్ ఎక్కువగా ఉంటుంది అని, అందుకు తగ్గ బడ్జెట్ ఉండదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. దీంతో అలాంటివారు ఫస్ట్ క్లాస్ ట్రైన్ లో వెళ్లాలి అనుకున్న కోరికను విరమించుకుంటూ ఉంటారు. అటువంటి వారికీ గుడ్ న్యూస్. ఇకపై బడ్జెట్ సపోర్ట్ చేయలేదు పడాల్సిన అవసరం లేదు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అందుకు సంబంధించిన డబ్బును తర్వాత చెల్లించవచ్చు.

అవును మీరు విన్నది నిజమే. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ ఈ విజయవంతమైన వ్యూహాన్ని ఐఆర్సిటిసి కూడా ఉంచుకోబోతోంది. ట్రావెల్ నౌ పే లేటర్ సదుపాయం కింద మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీ దగ్గర బడ్జెట్ ఉన్నప్పుడు డబ్బును చెల్లించవచ్చు. అయితే ట్రావెల్ నౌ పే లేటర్ సదుపాయం కింద మీరు టికెట్ ని బుక్ చేసుకునే సప్పుడు మొత్తాన్ని చెల్లించే బదులు ఒక సదుపాయాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం మీరు CASHe ఐఆర్సిటిసి తో భాగస్వామ్ కలిగి ఉంది. అదేవిధంగా మీరు 3 నుండి 6 ఈఎంఐ ల సదుపాయాన్ని కూడా పొందవచ్చు.

CASHe సోషల్ లోన్ కోటిన్ ని ఉపయోగించి వినియోగదారుల ప్రొఫైల్ ని కూడా తనకి చేస్తుంది. వాటి ఆధారంగా రుణాన్ని అందిస్తుంది. కాగా ఇందుకోసం AI ఆధారిత సాంకేతికతను ఉపయోగించమని, సాధారణ పద్ధతిలో రుణాలు పొందడం సాధ్యం కానీ వారికి కూడా రుణాలు ఇవ్వవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఏ కారణం చేతనైన టికెట్లు బుక్ చేసుకోవడానికి డబ్బులు లేనివారు అటువంటి పరిస్థితులలో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రయాణం సమయంలో చార్జీల ఒత్తిడి సమస్య విముక్తి పొందవచ్చు.

Exit mobile version