Site icon HashtagU Telugu

Reuters Account: అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఎక్స్ హ్యాండిల్‌ భారత్‌లో బ్లాక్..!

Reuters Account

Reuters Account

Reuters Account:అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక @Reuters X ( Reuters Account) హ్యాండిల్ ప్రస్తుతం భారత్‌లో బ్లాక్ చేయబడింది. యూజర్లు ఈ హ్యాండిల్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. “ఈ అకౌంట్ భారత్‌లో చట్టపరమైన డిమాండ్ కారణంగా అందుబాటులో లేదు” అని ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ చర్య పత్రికా స్వేచ్ఛ, డిజిటల్ స్వాతంత్య్రంపై చర్చను మరోసారి రేకెత్తించింది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వం స్పష్టం చేసింది

కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో రాయిటర్స్ X హ్యాండిల్‌ను బ్లాక్ చేయమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఇలా తెలిపారు. రాయిటర్స్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయడానికి భారత ప్రభుత్వం నుండి ఎలాంటి అవసరం లేదు. మేము ఈ సమస్యను పరిష్కరించడానికి Xతో నిరంతరం సంప్రదిస్తున్నామని పేర్కొంది. ఈ బ్లాక్ సంభవించడం వెనుక బహుశా పాత ఆదేశంపై ఆలస్యంగా చేపట్టిన చర్య కావచ్చని, ఇది ప్రస్తుతం ప్రసంగికం కాదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

Also Read: IND vs ENG: భార‌త్‌- ఇంగ్లాండ్ రెండో టెస్ట్‌.. ఐదో రోజు ఆట‌కు వ‌ర్షం అంత‌రాయం!

వార్తా సంస్థ PTI ప్రకారం.. 2025 మే 7న ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వం వందలాది సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయమని అభ్యర్థించింది. ఆ సమయంలో రాయిటర్స్ హ్యాండిల్‌పై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్పుడు, X ప్లాట్‌ఫాం ఆ పాత ఆదేశంపై చర్య తీసుకున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక అధికారి దీనిని X తప్పిదంగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సెన్సార్‌షిప్‌ను ఎత్తివేయమని, స్పష్టీకరణ ఇవ్వమని Xను కోరింది.

భారత్‌లో ఏ హ్యాండిల్స్ బ్లాక్ చేశారు?

భారత్‌లో @Reuters (ప్రధాన హ్యాండిల్), @ReutersWorld బ్లాక్ చేశారు. అయితే, @ReutersAsia, @ReutersTech, @ReutersFactCheck వంటి ఇతర అనుబంధ హ్యాండిల్స్ సజావుగా పనిచేస్తున్నాయి. ఇది పూర్తి నిషేధం కాకుండా, ఎంపిక చేసిన హ్యాండిల్స్‌పై బ్లాక్ అని సూచిస్తుంది. X విధానం ప్రకారం.. ఒక దేశంలోని ప్రభుత్వం లేదా కోర్టు నుండి చట్టపరమైన ఆదేశం అందినట్లయితే, ఆ దేశంలో సంబంధిత కంటెంట్ లేదా అకౌంట్‌ను నిషేధించవచ్చు. అయితే, ఈ బ్లాక్‌కు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది ప్రభుత్వం, X మధ్య ఏదైనా అపార్థానికి దారితీసిందా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.