SIM Card: 2024 నుంచి సిమ్ కార్డ్ విషయంలో సరికొత్త రూల్స్.. ఇక మీదట డాక్యుమెంట్స్ తో పని లేదట!

మామూలుగా కొత్త సిమ్ కార్డు కొనుక్కోవాలి అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ ఫిల్ అప్ చేయాలి ఐడీలు,ఫోటోలు కావాలి ఆధార్ కార్డు ఇలా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Dec 2023 05 57 Pm 2310

Mixcollage 08 Dec 2023 05 57 Pm 2310

మామూలుగా కొత్త సిమ్ కార్డు కొనుక్కోవాలి అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ ఫిల్ అప్ చేయాలి ఐడీలు,ఫోటోలు కావాలి ఆధార్ కార్డు ఇలా ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ నిరూపించడం తప్పనిసరి. అయితే ఈ తిప్పలు త్వరలో తప్పే అవకాశం ఉంది. 2024 నుంచి సిమ్ కార్డు‌లను జారీ చేయడానికి పేపర్-బేస్డ్ నో యువర్ కస్టమర్ ప్రక్రియను ముగించనున్నట్లు భారత ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంటే 2024 నుంచి సిమ్ కార్డు తీసుకోవడానికి డాక్యుమెంట్స్ లేదా ఫొటోల ఫిజికల్ కాపీలను సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.

ఇంతకీ ఆ కొత్త రూల్ ఏంటి అన్న విషయానికి వస్తే.. వచ్చే సంవత్సరం నుంచి KYC ఆఫ్‌లైన్ ప్రాసెస్‌కి బదులుగా, ఆన్‌లైన్‌లో ఐడెంటిటీ, అడ్రస్ వెరిఫై చేసుకునే డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతి వల్ల త్వరగా, సులభంగా సిమ్ కార్డు తీసుకోవడం కుదురుతుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం ఈ మార్పును కన్ఫామ్ చేసే ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిజిటల్ KYC ప్రక్రియ ఫాలో అవ్వాలని దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఇది ఆపరేటర్లు, కస్టమర్లు ఇద్దరికీ స్వాగతించదగిన చర్య అని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఇది సిమ్ కార్డు‌లను జారీ చేయడంలో ఖర్చు, సమయాన్ని తగ్గిస్తుంది. సిమ్ కార్డు ఫ్రాడ్స్ జరగకుండా నిరోధించగలుగుతుంది. అలాగే నోటిఫికేషన్‌లో డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ గురించిన వివరాలను పేర్కొనలేదు. అయితే ఈ ప్రాసెస్‌లో ఆధార్‌ ను ఉపయోగించచ్చు. ఆధార్‌ కు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ డీటైల్స్ లింక్ అవుతాయి. ఆధార్‌ లోని ఇవే డీటైల్స్ ఆధారంగా ఐడెంటిటీ, అడ్రస్‌ను సిమ్ కార్డు జారీ చేసేవారు వెరిఫై చేసే అవకాశం ఉండవచ్చు. ఆధార్ ఆధారిత వెరిఫికేషన్‌తో చాలా త్వరగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా సిమ్ కార్డు పొందడం సాధ్యమవుతుంది. ప్రాసెస్ పూర్తి చేసిన వెంటనే సిమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. పేపర్ ఆధారిత వెరిఫికేషన్‌ చేస్తే సిమ్ యాక్టివేట్ కావడానికి 24 గంటల సమయం పడుతుంది. అయితే ఆధార్ ఆధారిత డిజిటల్ వెరిఫికేషన్‌తో నిమిషాల్లో కొత్త సిమ్ కార్డు‌ని పొందడమే కాక గంటల్లోనే యాక్టివ్ సర్వీస్ పొందవచ్చు.

  Last Updated: 08 Dec 2023, 05:58 PM IST