Site icon HashtagU Telugu

Indias AI : మేడిన్ ఇండియా ‘ఏఐ’ వస్తోంది.. రంగంలోకి బడా కంపెనీలు

Indias Ai Model Ai Generative Model Chatgpt Deepseek

Indias AI : తొలుత కంప్యూటర్ యుగం..  ఆ తర్వాత టెలికాం యుగం..  తదుపరిగా ఇంటర్నెట్ యుగం.. ఆ తదుపరి డిజిటల్ యుగం.. ఇకపై ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్) యుగం రాబోతోంది. మన భారతదేశం కూడా ఈ ఏఐ యుగంలో ముందుకు దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఈక్రమంలోనే సొంత ఏఐ జనరేటివ్ మోడల్‌ను తయారు చేసుకోవడంపై భారత్ ఫోకస్ పెట్టింది. వివరాలు  చూద్దాం..

Also Read :Rahul Gandhi : ఔను.. అప్పుడు దళితులు, బీసీలను కాంగ్రెస్ విస్మరించింది.. రాహుల్‌ వ్యాఖ్యలు

రంగంలోకి రిలయన్స్

కేంద్రంలోని మోడీ సర్కారు ఏది చేసినా.. ఫ్యూచర్‌పై విజన్‌తోనే చేస్తుంది. భవిష్యత్తులో మన దేశంలో ఏఐ రంగంలో ఏయే కంపెనీ ఎలాంటి యాక్టివిటీ చేయబోతోందో భారత ప్రభుత్వానికి బాగా తెలుసు. ఎందుకంటే ఏ సంస్థ అయినా ప్రభుత్వ అనుమతితోనే కార్యకలాపాలన మొదలుపెడుతుంది.  ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్, అమెరికా దిగ్గజ ఏఐ టెక్నాలజీ కంపెనీ ఎన్‌విడియా (Nvidia) 2024 సంవత్సరం అక్టోబరులోనే జట్టు కట్టాయి. భారత్‌లో ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో కలిసి పనిచేయాలని ఈ రెండు బడా కంపెనీలు నిర్ణయించాయి. ఈ పరిణామం జరిగిన దాదాపు  మూడు నెలల తర్వాత కేంద్ర  ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఓపెన్ ఏఐ, డీప్‌సీక్‌ మాదిరిగానే భారత్‌ కూడా సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను(Indias AI) తీసుకొస్తుందని ఆయన వెల్లడించారు. 6 నుంచి 8 నెలల్లో ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు కనీసం ఆరుగురు నిపుణులైన డెవలపర్లు అవసరమని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే నాలుగు నుంచి 6 నెలల్లోగా భారత్‌ సొంత జనరేటివ్ ఏఐ మోడల్‌ను విడుదల చేయాలనేది తమ ప్రాథమిక లక్ష్యమని ఆయన చెప్పారు.

Also Read :Bill Gates : అమ్మాయిలను బుట్టలో వేసుకోవడానికి అది స్మోక్ చేశా : బిల్‌గేట్స్

చైనా వాళ్లు రూ.51 కోట్లకే తయారు చేశారు

చైనాలోని ఒక స్టార్టప్ కంపెనీ ఛాట్‌ జీపీటీని తలదన్నేలా అతి తక్కువ ఖర్చుతోనే ఏఐ మోడల్ ‘డీప్‌సీక్‌‌’ను తయారు చేసింది. డీప్ సీక్ ఇప్పుడు డౌన్‌లోడ్ల విషయంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ డీప్ సీక్‌కు భారీ డౌన్‌లోడ్లు వచ్చాయి. ఎందుకంటే దాన్ని వినియోగించడం చాలా ఈజీగా ఉంది. ఛాట్ జీపీటీ కంటే మెరుగైన సమాచారాన్ని డీప్ సీక్ ఇస్తోందట.  కేవలం రూ.51 కోట్ల పెట్టుబడితో డీప్ సీక్‌ను చైనా స్టార్టప్ తయారు చేసింది. త్వరలో మన భారతదేశ సొంత ఏఐ జనరేటివ్ మోడల్‌ను ఎంత ఖర్చుతో తయారు చేసి ఆవిష్కరిస్తారో వేచిచూడాలి.