Site icon HashtagU Telugu

Laptop Prices: బంపర్ ఆఫర్.. లక్ష రూపాయల ల్యాప్ టాప్ రూ.40 వేలకే..?

Imports Of Laptops

Laptop

ల్యాప్ టాప్ లు కొనుగోలు చేయాలి అనుకున్న వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే రానున్న రోజుల్లో లక్ష రూపాయలు విలువ చేసే లాప్టాప్ లు కేవలం 40 వేలకే కి లభించనున్నాయట. లేదంటే ఇంకా తక్కువ ధరకే ఈ లాప్ టాప్ లు అందుబాటులో ఉండవచ్చు అని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. దేశంలోని సెమీ కండక్టర్ చిప్స్ ఇందులో ఉంటాయి అని ఆయన తెలిపారు. ఇకపోతే అనిల్ అగర్వాల్ ఇటీవలే ఫాక్స్ కాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

ఇక ఇందులో భాగంగానే వేదాంత కంపెనీ కొత్తగా సెమి కండక్టర్ ప్లాంట్ ను గుజరాత్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇందుకోసం 1.54 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ల వల్ల దేశంలో ఫినిష్డ్ ప్రాజెక్టులపై చాలా ప్రభావం దున్నపోతున్నట్టు తెలిపారు. తాగా చిప్స్ అనేవి ప్రస్తుతం కొరియా,తైవాన్ లో తయారు అవుతుండగా రానున్న రోజుల్లో భారత్ లో కూడా వీటిని తయారు చేయగలము అని ఆయన వెల్లడించారు.

అదేవిధంగా డిజిటల్ కన్జ్యూమర్ ప్రాజెక్టులలో సెమీ కండక్టర్లు లేదా మైక్రో చిప్స్ ను కూడా ఉపయోగిస్తారు. దేశంలో 2021లో సెమీ కండక్టర్ల మార్కెట్ విలువ 27 బిలియన్ డాలర్లుగా ఉండగా 2026 వచ్చేసరికి ఈ విధంగా 64 బిలియన్ డాలర్లకు చేరవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. కాకపోతే మన దేశంలో చిప్స్ తయారీ లేకపోవడంతో దిగుమతి చేసుకోబోతున్నట్లు అంచనా వేశారు . కానీ పరిస్థితుల మారి దేశంలోనే చిప్స్ తయారీ జరగబోతోంది..

Exit mobile version