Site icon HashtagU Telugu

India 5G: భారత్ లో వేగంగా 5G సేవలు… ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు?

India 5g

India 5g

తాజాగా ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ అయిన ఊక్లా కీలక ప్రకటనను చేసింది. భారత్‌లో నిర్వహించిన డేటా టెస్ట్‌ వివరాల గురించి తెలిపింది. కాగా ఈ ఊక్లా కంపెనీ లెక్కల ప్రకారం, భారత్‌ లో 5G టెస్ట్ నెట్‌ వర్క్‌ లో డౌన్‌లోడ్ వేగం 500 MBPS కి చేరుకుందని . వెల్లడించింది. ఇక ఇందులో రిలయన్స్ జియో 598.58 MBPS తో అగ్రస్థానంలో ఉండగా, ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్ ఢిల్లీలో 197.98 MBPS నమోదు చేసింది.

అక్టోబర్ 1 లాంచ్‌కు ముందు టెలికాం ఆపరేటర్లు తమ నెట్‌వర్క్‌లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. భారత్లో 5G డౌన్‌లోడ్ వేగం 16.27 MBPS నుంచి 809.94 MBPS వరకు ఉందని తేలిందట. అయితే భారతదేశంలో టెలికాం ఆపరేటర్లు 5G ని ప్రారంభించక ముందే పరీక్షించినట్లుగా ఊక్లా డేటా హైలైట్ చేసింది. ఇక పోతే ప్రస్తుతం 5G డౌన్‌లోడ్ వేగం 16.27 MBPS నుంచి 809.94 MBPS వరకు ఉందని డేటా చూపిస్తుంది. కాగా ఈ నెట్‌వర్క్‌లు వాణిజ్య దశ౦లోకి ప్రవేశిస్తున్నందున ఈ వేగం మరింత స్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు.

భారతి ఎయిర్‌టెల్ మీడియన్ డౌన్‌లోడ్ వేగం 33.83 MBPS కాగా, జీయో 482.02 MBPS వద్ద చాలా వేగంగా డౌన్‌లోడ్ స్పీడ్‌ని కలిగి ఉంది. అయితే వారణాసిలో మాత్రం జీయో, భారతి ఎయిర్‌టెల్ దగ్గరగా కనిపించింది. జూన్ నుండి భారతి ఎయిర్‌టెల్ 516.57 MBPS నుంచి జీయో 485.22 MBPS వేగంతో 5G మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్‌ని సాధించింది. ఊక్లా లెక్కల ప్రకారం, ఆగస్టు 2022లో మొబైల్ డౌన్‌లోడ్ వేగం 13.52 MBPS తో భారతదేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉంది.

Exit mobile version