Site icon HashtagU Telugu

Whatsapp Update: వాట్సాప్ స్టేటస్ ప్రియులకు గుడ్ న్యూస్.. నయా అప్డేట్!

Mixcollage 29 Jul 2024 04 19 Pm 9747

Mixcollage 29 Jul 2024 04 19 Pm 9747

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పదుల సంఖ్యలో ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వాట్సాప్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. యూజర్లు వారి ఫ్రెండ్స్ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌లను కూడా నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ షేర్ చేసుకునే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందట.

అయితే ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ భవిష్యత్‌లో అందరికీ అందుబాటులోకి రానుందని టాక్. రిషేర్ స్టేటస్ అప్‌డేట్‌ పేరుతో ఈ కొత్త ఫీచర్, వినియోగదారులు ట్యాగ్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేసే ప్రక్రియను సులభతరం చేయనుంది. మీ ఫ్రెండ్స్ పెట్టే వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ మిమ్మల్ని ట్యాగ్ చేస్తే ఈ కొత్త ఫీచర్ ద్వారా ఆ స్టేటస్‌ ను మీరు తిరిగి రీషేర్ చేయవచ్చు. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌ లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కానీ వాట్సాప్ భవిష్యత్ అప్‌డేట్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు తెలిపారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ ఫేస్‌లో కొత్త బటన్‌ ను కనిపిస్తుందని, ఈ బటన్ ద్వారా వారు పేర్కొన్న స్టేటస్ అప్‌డేట్ సులభంగా రీ షేర్ చేయవచ్చట.

ముఖ్యంగా స్క్రీన్‌ షాట్‌లను తీయడం లేదా మీడియాను ప్రైవేట్‌గా పంపమని ఫ్రెండ్స్‌ను అడిగే అవసరం లేకుండా ఈ ఫీచర్ ద్వారా సింపుల్‌గా స్టేటస్‌ ను రీషేర్ చేయవచ్చట. స్టేటస్ రీషేర్ ఫీచర్ ద్వారా కంటెంట్ షేరింగ్‌ను సరళీకృతం అవ్వడమే కాకుండా యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. స్టేటస్ అప్‌డేట్ ఇంటర్‌ఫేస్ ద్వారా నేరుగా స్టేటస్ రీషేర్ చేయవచ్చట.

Exit mobile version