Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై హెచ్‌డీ ఫొటోలను పంపడిలా?

Whatsapp

Whatsapp

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ వీడియో కాల్స్ అలాగే ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజు రోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పోవడంతో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

కాగా వాట్సాప్ ఎంత ప్రజాదరణ పొందినా కూడా ఫొటోలు పంపే విషయంలో మాత్రం వినియోగదారులు ఇబ్బందిపడుతూనే ఉన్నారు. వాట్సాప్‌లో ఏదైనా ఫొటో పంపితే అది ఆటోమెటిక్‌గా కంప్రెస్ అయ్యిపోతుంది. ముఖ్యంగా హెచ్‌డీ ఫొటోలను సెండ్ చేసుకునే అవకాశం వాట్సాప్‌ లో లేదు. దీంతో వినియోగదారులు ఫొటోలను డాక్యుమెంట్ ఫార్మాట్‌లో పంపుకుంటున్నారు. అయితే కొన్ని ఫోన్స్‌లో ఈ ఫార్మాట్ సపోర్ట్ చేయకపోవడం వల్ల హెచ్‌డీ ఫొటోలు పంపుకోవడం ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ వాట్సాప్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ తాజా ఫీచర్‌తో సింపుల్‌గా హెచ్‌డీ ఫొటోలను కూడా సెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి..

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో హై డెఫినిషన్‌లో ఫోటోలను పంచుకోవడానికి అనుమతించే మరొక ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్‌తో పాటు ఆండ్రాయిడ్ వెర్షన్ లలో అందుబాటులోకి వస్తుందని తేలింది. సాధారణంగా వినియోగదారులు వాట్సాప్‌లో ఫొటో షేర్ చేసినప్పుడు వాట్సాప్ ఆటోమేటిక్‌గా ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తుంది. అయితే కొత్త ఫీచర్‌తో, అధిక రిజల్యూషన్‌లో ఫొటోలను పంపడం మరింత సులువుగా ఉంటుంది. కొత్త ఫంక్షనాలిటీ ఇమేజ్ కొలతలను సంరక్షిస్తున్నప్పుడు లైట్ కంప్రెషన్ ఇప్పటికీ వర్తిస్తుంది.

అయితే వినియోగదారులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మీరు ఫోటోను షేర్ చేసినప్పుడు, డిఫాల్ట్ ఎంపిక ఎల్లప్పుడూ ప్రామాణిక నాణ్యతకు సెట్ అవుతుంది. ఇది మీరు అధిక రిజల్యూషన్‌లో చిత్రాన్ని పంపడానికి మీరు హెచ్‌డీ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇందుకోసం వాట్సాప్ మెసేజ్ బబుల్‌కి కొత్త ట్యాగ్‌ను కూడా జోడిస్తుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించి ఫోటో ఎప్పుడు పంపించామో? గ్రహీతకు గుర్తించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం హెచ్‌డీ ఫొటోలను పంపగల సామర్థ్యం సంభాషణలలో భాగస్వామ్యం చేసిన చిత్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఈ తాజా ఫీచర్ వాట్సాప్ బీటాలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ఫీచర్ ఇతర వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.