Site icon HashtagU Telugu

IIT Hyderabad: దివ్యాంగుల కోసం ఐఐటీ హైదరాబాద్ అద్భుత ఆవిష్కరణ…వివరాలు ఇవే..!

Iit Hyderabad Imresizer

Iit Hyderabad Imresizer

మనదేశంలో మొదటిసారిగా దివ్యాంగుల కోసం కృత్రిమ మేథ ఆధారిత జాబ్ పోర్టల్ షురూ అయ్యింది. స్వరాజబిలిటీ పేరుతో లాంచ్ అయిన ఈ జాబ్ పోర్టల్….టెక్నాలాజికల్ సపోర్టుతో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలను విస్త్రుతం చేయనుంది. భారత ప్రభుత్వ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్ ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ వెబ్ సైటుతోపాటుగా మొబైల్ వెర్షన్ అందుబాటులో ఉన్న ఈ ఫ్లాట్ ఫాం కంటిచూపు లేనివారికి, వినికిడి లోపం ఉన్నవాళ్లకు, లోకోమోటిడ్ డిజార్డర్ వంటి వైకల్యామున్న వ్యక్తులకు ఉపాధి అవకాశాలను ఈ సైట్ వెతికి పెడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ టెక్నికల్ సపోర్టు అందించింది. ఈ ప్రాజెక్టకు కొటక్ మహీంద్రా బ్యాంక్ నిధులు సమకూర్చనుంది. దేశంలో దాదాపు 2.1 కోట్ల మంది అంగవైకల్యం ఉన్నవారు ఉన్నారు.

ఇక వీరిలో 70శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని అంచనా. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పీడబ్య్లూడీ విద్య ఉపాధికి సంబందించిన హక్కులపై సర్కార్ ప్రత్యేక ద్రుష్టిని సారించింది. నిజానికి దివ్యాంగుల్లో నైపుణ్యానికి అసలు కొదవే లేదు. కానీ ఉద్యోగులు లభించే కంపెనీలకు చేరుకోవడమే వారికి పెద్ద సమస్య. అయితే ఎన్నో వ్యయప్రయాలకోర్చి వారు కంపెనీలకు చేరుకుంటున్నారు. అయినప్పటికీ పలు జాబ్ ప్లాట్ ఫాంలు వారి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఉపాధిని అందించేందుకు రెడీగా లేవు.

అందుకే ఇలాంటి అడ్డుకుంటున్నిటిని తొలగించే విధంగా స్వరాజబిలిటీ జాబ్ ఫ్లాట్ ఫాంను రెడీ చేశారు. ఇది దివ్యాంగులకు స్వతంత్రతను అందిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఠాన్ని ఉపయోగించి చేసే ఈ ప్రయత్నం అన్ని రంగాల్లో నిష్ణాతులైన దివ్యాంగులకు ఉద్యోగాలను సెర్చ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇక దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించాలనుకునే సంస్థలకు ఇది బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు.

Exit mobile version