Site icon HashtagU Telugu

Electric Scooter: ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు శుభవార్త.. కేవలం 35 వేలకే వాహనం?

Electric Scooter

Electric Scooter

దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి మరిన్ని ఆఫర్లను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వాహనదారులను ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మళ్లేలా పోత్సహిస్తున్నారు. దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు కూడా వాహనదారులను ఆకర్షించుకోవడం కోసం అతి తక్కువ ధరలకే ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి అన్నా కూడా వాటి ధర విషయంలో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వరకు లక్షల్లో కూడా ఉంటున్నాయి. దాంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి కాస్త వెనుకాడుతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు శుభవార్త చెబుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 35 వేలకే అందిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుండడంతో చాలావరకు వినియోగదారులు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎలక్ట్రిక వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.కాగా ఇప్పటికే బజాజ్, హీరో, ఓలా, ఎథర్ వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉన్న విషయం తెలిసిందే.

వాటికి ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వచ్చి చేరుతున్నాయి. కాకపోతే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటోంది. ఐఐటీ ఢిల్లీకి చెందిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ బాజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా దుమ్ము, ధూళిని తట్టుకునేందుకు ఐపీ65 సర్టిఫికేట్ కూడా ఉంది. ఈ స్కూటర్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్కూటర్ కేవలం 1624 ఎంఎం మాత్రమే పొడవు ఉంటుంది. దీని విడ్త్ కేవలం 680 ఎంఎం మాత్రమే. అంతేకాకుండా ఈ స్కూటర్ ని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసర్లేదు. 90 సెక్లలోనే మీ బైక్ బ్యాటరీస్ మార్చుకొని నిరంతరాయంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ స్కూటర్ లో వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అలాగే ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంది. ఇది వాహనాన్ని ఎంతో స్మూత్ గా వెళ్లేందుకు సహకరిస్తాయి. దీనిలో ఫైండ్ మై బైక్ ఫీచర్ ఉంది. మీ స్కూటర్ ఎక్కడున్నా గుర్తించొచ్చు. ఈ బైక్ గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు.