Site icon HashtagU Telugu

Mobile: మీ ఫోన్ చోరికి గురయిందా..అయితే వెంటనే ఇలా చేయండి లేదంటే?

Mixcollage 20 Feb 2024 05 30 Pm 9740

Mixcollage 20 Feb 2024 05 30 Pm 9740

ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫోన్‌లను వాడుతున్నారు. చాలా మంది తమ ఫోన్‌లను పోగొట్టుకోవడం లేదా చోరీకి గురవడమో జరుగుతుంటుంది. అలాంటి సమయంలో టెన్షన్‌కు గురవుతూ ఉంటారు. మీ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా పోయినా వెంటనే కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ అవుతుంది. నేటి కాలంలో మొబైల్‌లు యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అనేక ఇతర ఆర్థిక సేవలకు ఉపయోగకరంగా ఉంటాయి.

దీంతో తమ మొబైల్ చోరీకి గురైతే తమ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. మరి ఫోన్ దొంగలించగానే వెంటనే ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా, మీ SIM కార్డ్‌ని వెంటనే బ్లాక్ చేయండి. దీని కోసం మీరు మీ టెలికాం ఆపరేటర్ కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు లేదా 14422 నంబర్‌కు డయల్ చేయవచ్చు. అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయాలి. FIRలో ఫోన్ IMEI నంబర్, ఇతర సమాచారాన్ని అందించాలి. మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేసి, డేటాను క్లియర్ చేయాలి. మీ ఫోన్‌లో Find My Device లేదా Find My Phone ఫీచర్‌ను ఆన్ చేయబడి ఉంటే, మీరు మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడానికి, మీ డేటాను డిలీట్‌ చేయడానికి దాన్ని ఉపయోగించవచ్చు.

మీ ఫోన్ IMEI నంబర్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ముందుగానే నోట్‌ చేసుకోండి. మీ ఫోన్‌లో ఫైండ్‌ మై ఫోన్‌ ఫీచర్‌ను ఆన్ చేయాలి. పాస్‌వర్డ్ లేదా పిన్‌తో మీ ఫోన్‌ను రక్షించండి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఫోన్‌ను దొంగతనం జరిగినా మీ వ్యక్తిగత వివరాలు వారికి తెలియకుండా రక్షించుకోవచ్చు. అలాగే దొంగిలించిన మీ ఫోన్‌ను గుర్తించేందుకు ఆస్కారం ఉంటుంది.