Site icon HashtagU Telugu

AC : ఏసీ వాడుతుంటే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందా..? ఇలా చెయ్యండి మీకు బిల్లు రాదు.!!

Ac Current Billu

Ac Current Billu

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎండ వేడి తట్టుకునేందుకు చాలామంది ఇళ్లల్లో ఏసీ (AC) లు వాడుతున్నారు. అయితే ఏసీ వాడేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో..నెలతిరిగే సరికి వచ్చే కరెంట్ బిల్లు (Current Billu) చూసి వామ్మో అనిపిస్తుంది. కొంతమంది ఈ కరెంట్ బిల్లు కు భయపడి ఏసీ వాడడం మానేస్తున్నారు. అయితే ఏసీ లు వాడే టైములో చేసే చిన్న చిన్న తప్పులే మీ కరెంట్ బిల్లు వాచిపోయేలా చేస్తుంది. చాలామంది ఏసీ ఆన్ చేయగానే త్వరగా గది చల్లగా కావాలని చెప్పి ఏసీని 16 లేదా 18° వద్ద పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల త్వరగా గది చల్లగా అవుతుందని భావిస్తారు. కానీ ఆలా పెట్టడం వల్ల గది చల్లగా అవ్వడం కంటే కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేలా చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వాస్తవానికి మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు.. కాబట్టి ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల వద్ద ఉంచితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఆరు శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. అలాగే ఏసీ ఆన్ చేసే ముందు చాలామంది రూమ్ డోర్ ఓపెన్ గా పెట్టడం , తలుపులు ఓపెన్ చేసి పెట్టడం చేస్తుంటారు. ఆలా చేయడం వల్ల ఏసీ గాలి అనేది బయటకు వెళ్లి ఎంత సేపటికి రూమ్ కూల్ అవ్వదు. దీని వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అందుకే ఏసీ ఆన్ చేసే ముందు బయట గాలి లోనికి రాకుండా..లోని గాలి బయటకు వెళ్లకుండా క్లోజ్ చెయ్యాలి. అలాగే ఏసీని స్లీప్ మోడ్లో ఉపయోగిస్తే 36 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. దీని వల్ల కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది.

అలాగే ఏసీ ఆన్ చేసినప్పుడు రూమ్ లో ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి..ఆలా ఆన్ చేసి ఉంటె ఏసీ గాలి గదిలో ప్రతి మూలకు వెళుతుంది. దాంతో గది ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. ఏసీ ఉష్ణోగ్రతను కూడా తగ్గించాల్సిన అవసరం రాదు. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఏసీ కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది..మీ ఆర్ధికంగా ఇబ్బంది ఉండదు.

Read Also : OnePlus Phones: ‘వన్ ప్లస్’ ఫోన్స్.. వచ్చే నెల నుంచి ఈ రాష్ట్రాల్లో దొరకవు.. ఎందుకు..?

Exit mobile version