చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లతో పాటు ఇంకా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది వివో సంస్థ. అలాగే ఇప్పటికే విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. అందులో భాగంగానే వీవో వై 300 పేరుతో విడుదల చేసిన ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్న విషయం తెలిసిందే.
అయితే ఈ ఫోన్ రోజుకు కేవలం రూ.43 పడేలా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేయవచ్చట. వివరాల్లోకి వెళితే.. వివో వై 300 5జీని ఆవిష్కరించింది. దీనిలో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేసింది. కొత్త ఫోన్ రెండు రకాల స్టోరేజీ వేరియంట్ లలో అంటే 128 జీబీ, 256 జీబీ లలో లభిస్తుంది. సోనీ కెమెరాతో ఫోటోలు స్పష్టంగా తీసుకోవచ్చు. అధునాతన ఏఐ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ వీవో వై300 5జీ ఫోన్ మూడు రకాల వేరియంట్ లలో అందుబాటులో లభిస్తోంది. టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 8 జీబీ, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999 గా ఉంది. అలాగే 8 బీజీ, 256 జీబీ స్టోరేజీ ఫోన్ ను రూ.23,999కు కొనుగోలు చేసుకోవచ్చు. వీవో వై300 ఫోన్ బుక్కింగ్ లు ఈనెల 21న మొదలయ్యాయి. ఈ నెల 30 వరకూ కొనసాగుతాయి. అయితే ఈ డేట్ ను మరింత పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కస్టమర్ల కోసం కంపెనీ వివిధ ఆఫర్లు కూడా ప్రకటించింది, ఎస్బీఐ, ఐడీఎఫ్ సీ ఫస్ట్, కోటక్ మహీంద్రా, యస్, బీంబీ, ఫెడరల్ బ్యాంకులకు చెందిన వారికి డిస్కౌంట్లు అందిస్తోంది.
రూ. 2వేల తక్షణ క్యాష్ బ్యాక్ లేదా రోజుకు రూ. 43 సులభమైన ఈఎంఐ విధానంలో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అలాగే వీవో ఇండియా ఈ స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, అన్ని భాగస్వామి రిటైల్ స్టోర్ లలో కొనుగోలు చేయవచ్చట. వై 300 ఫోన్ కొనుగోలు చేసిన వారు రూ.1499కే వీవో టీడబ్ల్యూఎస్ 3ఈ ఫోన్ సొంత చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 21 నుంచి 30 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. కేవలం ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్టోర్ లలో మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. కానీ వీవో ఈ.స్టోర్‌లో మాత్రం వర్తించదు.