WhatsApp: మీరు కూడా వాట్సాప్ లో అలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే మీ అకౌంట్ బ్యాన్ అవ్వడం ఖాయం?

ప్రస్తుతం రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వ

  • Written By:
  • Publish Date - June 16, 2024 / 01:48 PM IST

ప్రస్తుతం రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ని వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను తప్పకుండా వినియోగిస్తున్నారు. వాట్సాప్ సంస్థ కూడా వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యూచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.. ఇప్పటికే ఎన్నో రకాల ఫ్యూచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ వాటితో పాటు ఎప్పటికప్పుడు వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

అయితే చాలామంది కొన్ని కొన్ని సార్లు వాట్సాప్ లో తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా పొరపాటున తెలిసి తెలియక అలాంటి తప్పులు చేస్తే మీ వాట్సప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు వాట్సాప్ సంస్థ వారి నిబంధనలను ఉల్లంఘించినందుకు వినియోగదారుల ఖాతాలను నిషేధించడం లేదా బ్యాన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. మీరు మీ వాట్సాప్‌ ఖాతాలో కొన్ని తప్పులు చేస్తే, మీ ఖాతా కూడా నిషేధించవచ్చు. మాములుగా వాట్సాప్ ఖాతానుచాలా కారణాల వల్ల నిషేధించవచ్చట.

ఆ కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఒకటి కంటే ఎక్కువ మంది వినియోగదారుల ద్వారా ఖాతాపై రిపోర్టింగ్‌ వస్తే ఆ వాట్సప్ అకౌంట్ బ్యాన్ చేస్తారు. అలాగే బల్క్‌ మెసేజ్‌లలో తెలియని కంటేంటునే షేర్‌ చేసిన కూడా ఖాతాను నిషేధిస్తారు. వైరస్‌లు లేదా మాల్వేర్ ఉన్న ఫైల్‌లను భాగస్వామ్యం చేయడం, తరచూ అనేక గ్రూప్‌లలో చేరడం, వేరొకరి ప్రమాణీకరణ కీతో అకౌంట్‌ను యాక్సెస్ చేయడం, వాట్సాప్ అనధికార వెర్షన్‌ను ఉపయోగించడం, వ్యక్తిగత డేటా దొంగిలించడం,,సేవా నిబంధనల ఉల్లంఘన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడం, ప్రసార జాబితా దుర్వినియోగం, థర్డ్‌ పార్టీ జాబితాలను ఉపయోగించడం,  పుకార్ల సందేశాలను వ్యాప్తి చేయడం, పెద్దమొత్తంలో సందేశాలను పంపడానికి చట్టవిరుద్ధమైన థర్డ్‌ పార్టీ యాప్‌ను ఉపయోగించడం, ఏదైనా వినియోగదారుని వారి అనుమతి లేకుండా గ్రూప్‌లో యాడ్‌ చేయడం,
ఎక్కువ సందేశాలను ఏకకాలంలో ప్రసారం చేయడం, నకిలీ మెసేజ్‌లను గ్రూప్స్‌లో,ఇ తర వాటిలో ప్రచారం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ గ్రూప్‌లు, పరిచయాలకు సందేశాలను పంపడం ఇలాంటి తప్పులు చేసినప్పుడు మీ వాట్సాప్ కాతాను నిషేదించవచ్చు. కాబట్టి ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.