Site icon HashtagU Telugu

I Phone 15 : అదిరిపోనున్న ఐ ఫోన్ 15… త్వరలోనే మార్కెట్ లోకి..

I Phone 15 coming soon with super features fans waiting for new model

I Phone 15 coming soon with super features fans waiting for new model

ఐఫోన్ (iphone) ఫ్యాన్ అయ్యుండి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నారా అయితే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే త్వరలో ఐఫోన్ 15 (iphone 15) రాబోతుంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో ఉండబోతుంది. ఇప్పటివరకు ఐ ఫోన్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అన్ని సాల్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రిలీజ్ చేస్తోంది ఆపిల్ (apple )కంపెనీ. కానీ చాలా కాలంగా మారకుండా ఉన్న కంప్లైంట్ ఏది అంటే ఫోన్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ (android) ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ.

అయితే ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఆపిల్ ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయనున్న ఐఫోన్ 15 సీరీస్ లో, బ్యాటరీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆపిల్ పాత మోడల్ తో పోలిస్తే ఐఫోన్ 15 మోడల్ లో అప్డేట్ చేయబడిన బ్యాటరీని పెట్టే అవకాశం ఉంది. ఐఫోన్ 15లో 3,877mAh, ఐఫోన్ 15 ప్లస్ లో 4,912mAh, ఐఫోన్ 15 ప్రోలో 3,650 mAh, ఐఫోన్ 15 ప్రోమాక్స్ లో 4,852 mAh బ్యాటరీలు ఉపయోగించనున్నట్టుగా తెలుస్తోంది.

అలాగే ఆపిల్ కెమెరా విషయంలో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14, 14 ప్లస్ మోడల్స్ కి 12 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. కానీ ఈసారి అయితే అన్ని మోడల్ల లోను 48 ఎంపీ మెయిన్ కెమెరా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులో 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే దీని డిస్‌ప్లే మాత్రం గత ఫోన్స్ లాగే 6.1 ఇంచెస్ ఉండనుంది. ఐఫోన్ 15లో ఇంకా ఏం స్పెషల్స్ ఉన్నాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి మరి. సెప్టెంబర్ లో ఐ ఫోన్ 15 మార్కెట్ లోకి రానున్నట్టు సమాచారం.

 

Also Read : Threads: ట్విట్టర్ కి పోటీగా థ్రెడ్స్ యాప్‌.. రెండు గంటల్లోనే 2 మిలియన్లకు పైగా ఖాతాలు..!