Site icon HashtagU Telugu

Hyundai: హ్యుందాయ్ కార్ల ధరపై కీలక ప్రకటన.. జనవరి నుంచి వర్తింపు?

Hyundai

Hyundai

దేశవ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న ఇన్ పుట్ ఖర్చుల కారణంగా హ్యుందాయ్ సంస్థ అన్ని రకాల మోడల్స్ పై ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. రోజు రోజుకి పెరుగుతున్న వాహనాలు తయారీ వ్యయం భవాని తగ్గించడం కోసం హ్యుందాయ్ కంపెనీ వచ్చే ఏడాది నుంచి వాహనాలు ధరలను పెంచనుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల ధరల పెంపు ప్రకటించిన మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, ఎం‌జి మోటార్ వంటి కంపెనీల లిస్ట్ లో చేరింది.

ఈ కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి ప్రణాళికలను ప్రకటించడం జరిగింది. కాగా వివిధ మోడల్స్ అండ్ వేరియంట్‌లను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. అలాగే పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం కంపెనీయే భరిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, HMIL కొనుగోలుదారుల పై ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఇంటర్నల్ ప్రయత్నాలను కూడా కొనసాగిస్తోంది. HMIL మోడల్ కి సంబంధించిన కొత్త ధరలు జనవరి 2023 నుండి వర్తిస్తాయి. కాగా హ్యుందాయ్ మోటార్ ఇండియా గత నెలలో అత్యధిక ఆన్యువల్ కార్స్ సేల్స్ ప్రదర్శించిన విషయం తెలిసిందే.

గత నెల అనగా నవంబర్ నెలలో దేశీయంగా 48,003 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక డిసెంబర్ నెలలో ఇప్పటివరకు 16,001 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కొరియన్ ఆటోమేకర్ కుములేటివ్ సేల్స్ సంఖ్య 64,004 యూనిట్లుగా ఉంది, 2021లో ఇదే నెలతో పోలిస్తే 36.4 శాతం పెరిగింది. అలాగే హ్యుందాయ్ మోటార్ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ ఐయోనిక్ 5ని ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు బుకింగ్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది.