Site icon HashtagU Telugu

Electric Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కి.మీ మైలేజ్…హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు మ్యాజిక్..!

Car

Car

భారత్ లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే టాటా నుంచి విడుదలైన నెక్సాన్ ఈవీ కార్లకు భారత్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉండగా ఎంజీ కంపెనీ జెడ్ ఎస్ ఈవీ పేరుతో ఓ కారును రిలీజ్ చేసింది. దేశీయంగా అతిపెద్ద కార్లీ తయారుదారీ సంస్థ అయినా హ్యందాయ్ ఇప్పుడు మరో ఎలక్ట్రానిక్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది. ఇప్పటికే హ్యందాయ్ అన్నింటి కన్నా ముందుగా కోనా పేరుతో ఎలక్ట్రిక్ SUVని తీసుకువచ్చింది.

కాగా ఇప్పుడు మరో SUVకారును మార్కెట్లోకి ఆవిష్కరించేలా ప్లాన్ చేస్తోంది. ఐయానిక్ పేరుతో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మధ్యే హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వెహికల్ ప్రణాళికలను ప్రకటించింది. దీనిలో భాగంగా 2028 నాటికి 6 ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ కంపెనీ అనుబంధ సంస్థ కియా కార్స్ కూడా తన కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కియా EV6ప్రీమియం ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి తీసుకురానుంది. మే 2022 నుంచి EV6బుకింగ్స్ ను ప్రారంభించనుంది ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 30నుంచి లక్షల వరకు ఉండనుంది.

హ్యుందాయ్ ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ఫ్లాట్ ఫాంపై నిర్మించబడింది. E-GMPబ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ కారు ఛార్జింగ్ కెపాసిటి, రేంజ్ కోసం గ్లోబల్ మార్కెట్లో తనదైన ముద్ర వేయనుంది. ఈఎలక్ట్రిక్ కారును 10 నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 20నిమిషాల సమయం మాత్రమే పడుతుందని కంపెనీ వెల్లడించింది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్ తో ఈ కారు వంద కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ తెలిపింది.

Exit mobile version