Google: గూగుల్‎లో భార్యభర్తల ఉద్యోగాలు ఊస్టింగ్.. లే ఆఫ్ తెచ్చిన దౌర్భాగ్యం!

కోవిడ్ పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకి మంచి గిరాకీ ఏర్పడింది 2020 లో. రెండు సంవత్సరాల వరకూ బాగానే ఉన్నా, మెల్లి మెల్లిగా ఐటీ ఉద్యోగులను తప్పిస్తూ ఉన్నాయి యాజమాన్యాలు.

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 08:20 PM IST

Google: కోవిడ్ పుణ్యమా అని ఐటీ ఉద్యోగులకి మంచి గిరాకీ ఏర్పడింది 2020 లో. రెండు సంవత్సరాల వరకూ బాగానే ఉన్నా, మెల్లి మెల్లిగా ఐటీ ఉద్యోగులను తప్పిస్తూ ఉన్నాయి యాజమాన్యాలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే తంతు. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఉద్యోగులకు ఏం చేయాలో తెలియని పరిస్థతి. 2022 లో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

2023 లో అయినా పరిస్థితి చక్కగా ఉంటుంది అనుకున్న ఉద్యోగులకు నిరాశే మిగులుతుంది. వేలాది మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నాయి కంపెనీలు. టెక్ ఉద్యోగులు గుండెల్ని అరచేత్తో పట్టుకుని కూర్చున్నారు అంటే అతిశయోక్తి కాదు. అలా ఉంది పరిస్థితి. ఉద్యోగస్తుల బాధలు వర్ణనాతీతం. ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోతున్నాయి.

ఒకేసారి ఉద్యోగాలు పోగొట్టుకున్న జంట!

కంపెనీలు తీస్తున్న ఉద్యోగాల వల్ల ఎన్నో కుటుంబాలు కష్టాలను ఎదురుకుంటున్నాయి. అలాంటి ఒక సందర్భం ఇప్పుడు చూద్దాం. లే ఆఫ్ చేసిన ఘనకార్యం వల్ల భార్యాభర్త ఒకేసారి నిరుద్యోగులుగా మారారు. ఈ సంఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఒక వార్తా సంస్థ దీని మీద వార్త ప్రచరించడమే.వారిద్దరూ పని చేస్తుంది గూగుల్ సంస్థలో. ఆ జంట ఎప్పటి నుంచో ఆ సంస్థలో పనిచేస్తున్నారు. ఒకరు ఆరు సంవత్సరాలుగా, ఇంకొకరు నాలుగు సంవత్సరాల నుండి పని చేస్తున్నారు.

ఆ జంట ఎప్పటికీ మర్చిపోలేని ఒక షాక్ లాగా, ఇద్దరినీ ఒకేసారి తప్పించింది గూగుల్ సంస్థ.వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న వేలకొద్దీ ఉద్యోగులను తప్పించాలని నిర్ణయం తీసుకుంది యాజమాన్యం. అందులో భాగంగానే ఈ జంటని కూడా తప్పించారు. ఒకేసారి ఉద్యోగాలు పోవడంతో ఎటూ తోచని స్థితిలో ఉన్నారు వారు. వారికి ఒక పాప కూడా ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తీసివేయడానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఖర్చులను తగ్గించడం ఇందులో ప్రధాన కారణం. రానున్న కాలంలో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను తీసేసి అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.