Smartphone Alternative : స్మార్ట్‌ఫోన్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్ డివైజ్ వచ్చేసింది. అదే ‘ఏఐ పిన్’ (Ai Pin)!! యాపిల్ కంపెనీ మాజీ ఉద్యోగులు స్థాపించిన హ్యూమన్ (Humane) అనే సంస్థ ‘ఏఐ పిన్’ను తయారు చేసింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ మాదిరిగా స్క్రీన్ ఉండదు. దీన్ని చొక్కాకు ఒక పిన్ను లాగా క్లిప్ చేసుకోవచ్చు. ఏఐ పిన్‌తో స్మార్ట్‌ఫోన్ తరహాలో కాల్స్, మెసేజ్‌లు, వెబ్ బ్రౌజింగ్ వంటివన్నీ చేసుకోవచ్చు. దీని ధరను 699 డాలర్లుగా (సుమారు రూ.58,200) హ్యూమన్ సంస్థ నిర్ణయించింది. ఇది అమెరికాలో నవంబర్ 16 నుంచి ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటుంది. 2024 ప్రారంభంలో దీని షిప్పింగ్ మొదలవుతుంది. ఏఐ పిన్‌ను ఉపయోగించడానికి హ్యూమన్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రతినెలా రూ.2వేలు (24 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు కట్టడం వల్ల టీ-మొబైల్ (T-Mobile) నెట్‌వర్క్ ఫోన్ నంబర్, డేటా కవరేజీని అందిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఏఐ పిన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, కెమెరా, మైక్రోఫోన్, యాక్సిలరో మీటర్ వంటి సెన్సార్‌లు ఉంటాయి.
- మీ అరచేతిలో లేదా ఇతర ప్రదేశాలపైనా సమాచారాన్ని డిస్‌ప్లే చేసేలా ఇందులో ప్రొజెక్టర్ ఉంది.
- లాంగ్వేజ్లను ట్రాన్స్‌లేట్ కూడా చేసుకోవచ్చు.
- ఏఐ పిన్.. ఓపెన్ ఏఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలతోనూ పనిచేస్తుంది.
- అప్లికేషన్లను రన్ చేయడానికి మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులపై ఆధారపడుతుంది.
- ఏఐ పిన్‌లో కంప్యూటర్ విజన్‌తో ఫొటోలు తీయగల లేదా వస్తువులను స్కాన్ చేయగల కెమెరా కూడా ఉంది. దీంతో ఫుడ్ ఐటమ్‌లను స్కాన్ చేస్తే.. న్యూట్రీషన్ డీటైల్స్ తెలియజేస్తుంది.
- ఫేసెస్, ప్లేసెస్, ప్రొడక్ట్స్‌ను గుర్తించడానికి దీనిలోని కెమెరాను ఉపయోగించవచ్చు.
- 2024లో ఏఐ పిన్‌లో నావిగేషన్ ఫీచర్లను సైతం ప్రవేశపెడతామని హ్యూమన్ కంపెనీ(Smartphone Alternative) తెలిపింది.