LunaRecycle Challenge: మనిషి ఎక్కడ అడుగుపెట్టినా.. అక్కడ కొన్ని వ్యర్థాలు తప్పకుండా మిగులుతాయి. ప్లాస్టిక్‌తో తయారైన వస్తువులు, నీటి బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, లగేజీ పెట్టెలు, మలమూత్రాలు వంటివన్నీ వ్యర్థాలుగా మిగిలిపోతుంటాయి. చాలా పర్యాటక ప్రదేశాల్లోనూ ఇవన్నీ పడి ఉండటాన్ని మనం గమనిస్తుంటాం. కేవలం మన భూమిపైనే కాదు.. చందమామపై కూడా ఇదే పెద్ద ప్రాబ్లమ్. చంద్రుడిపై ఏకంగా 96 సంచుల వ్యర్థాలు పడి ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ గుర్తించింది. వాటిని అక్కడి నుంచి తొలగించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రస్తుతం నాసా వెతుకుతోంది. ఈక్రమంలోనే కోట్ల రూపాయల భారీ ఆఫర్‌ను నాసా ప్రకటించింది. ఇంతకీ అదేమిటో తెలుసుకుందాం..
Also Read :Aghori Weds Varshini: అఘోరీతో మ్యారేజ్.. వర్షిణి సంచలన కామెంట్స్
‘లూనారీ సైకిల్ ఛాలెంజ్’.. ఇదీ
‘లూనారీ సైకిల్ ఛాలెంజ్’ పేరుతో సరికొత్త ఛాలెంజ్‌ను నాసా ప్రకటించింది. ఇందులో భాగంగా చంద్రుడిపై పేరుకుపోయిన వ్యర్థాలను నీరు, శక్తి, ఎరువుగా మార్చేందుకు ఏవైనా ఐడియాలు ఉంటే ఇవ్వాలని పిలుపునిచ్చింది. ఈ ఛాలెంజ్‌లో గెలిచే వారికి రూ.25 కోట్లు అందజేస్తామని ప్రకటించింది.
Also Read :Gangster Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీం అక్రమాస్తుల వ్యవహారం.. ఈడీ దూకుడు
వాటిలో మానవ వ్యర్థాలే ఎక్కువ..
నాసా 1969 నుంచి 1972 మధ్యకాలంలో అపోలో మిషన్ ద్వారా వ్యోమగాములను చంద్రుడిపై రీసెర్చ్ కోసం పంపించింది. ఆరుసార్లు విజయవంతంగా మిషన్లు ల్యాండ్ అయ్యాయి. అప్పట్లో లూనారీ మాడ్యూల్‌లో నిల్వ ఉంచే స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకొని, వ్యోమగాములు అనవసరమైన వస్తువులను బయటకు విసిరేసి వచ్చారు. వీటిలో మానవ వ్యర్థాలే అధిక మొత్తంలో ఉన్నాయి.వీటిని చిన్నచిన్న బ్యాగుల్లో ఉంచి చంద్రుడిపై పడేసి వచ్చారు. దాదాపు 96 సంచుల వ్యర్థాలు ప్రస్తుతం చంద్రుడిపై ఉన్నాయి. వాటిని తొలగించే లక్ష్యంతోనే లూనారీ సైకిల్ ఛాలెంజ్‌ను(LunaRecycle Challenge) నాసా ప్రారంభించింది.