Human Washing Machine : మనిషికి నిత్య జీవితంలో సౌకర్యాన్ని అందించే చాలా రకాల ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. జపాన్ సైంటిస్టులు ఇప్పటివరకు చాలా ఆవిష్కరణలే చేశారు. తాజాగా వారు ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను కూడా తయారు చేశారు. ఏఐ టెక్నాలజీ సాయంతో మనుషులను ఉతికి ఆరేయడం దీని స్పెషాలిటీ.
Also Read :CJI Sanjiv Khanna: సీఈసీ, ఈసీల ఎంపిక వ్యవహారం.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ
హ్యూమన్ వాషింగ్ మెషీన్ విశేషాలు
- జపాన్‌లోని ఒసాకా నగరం కేంద్రంగా పనిచేస్తున్న ‘సైన్స్ కో’ కంపెనీ హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను తయారు చేసింది.
- ఈ మెషీనులో ఒక వ్యక్తి కూర్చోవడానికి సరిపడా కుర్చీ ఉంటుంది. ఇందులో కూర్చునే వ్యక్తిని శుభ్రపర్చడానికి 15 నిమిషాల టైం పడుతుంది.
- హ్యూమన్ వాషింగ్ మెషీన్ చూడటానికి ఫైటర్‌జెట్ కాక్‌పిట్ ఆకారంలో ఉంటుంది.
- త్వరలోనే ఒసాకా నగరంలో జరగబోయే ఒసాకా కన్సాయి ఎక్స్‌పోలో 1,000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీన్ని వాడుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించిన తర్వాత పెద్దసంఖ్యలో హ్యూమన్ వాషింగ్ మెషీన్లను తయారు చేస్తామని ‘సైన్స్ కో’ కంపెనీ వెల్లడించింది.
- ఈ మెషీన్‌లో పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ క్యాప్సూల్(Human Washing Machine) ఉంటుంది. క్యాప్సూల్‌లోని కుర్చీలో మనిషి కూర్చున్న తర్వాత సగానికిపైగా గోరువెచ్చని నీటితో నింపుతారు. అనంతరం అందులోని హెస్పీడ్ జెట్స్ నుంచి నీటిని మనిషిపైకి స్పీడుగా స్ప్రే చేస్తారు.
- ఈవిధంగా మనిషిపైకి స్ప్రే చేేసే నీటిలో 3 మైక్రోమీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ నీటి బుడగలు ఉంటాయి. ఇవి మనిషి శరీరంపై ఉన్న మురికిపై ఒత్తిడిని కలిగించి తొలగిస్తాయి.
- హ్యూమన్ వాషింగ్ మెషీనులో కూర్చున్న వ్యక్తి ఎలాంటి మూడ్‌లో ఉన్నాడనే విషయాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ద్వారా అంచనా వేస్తారు. అతడి మూడ్‌ను బట్టి తగిన వీడియోను వాషింగ్ మెషీనులో ప్రసారం చేస్తారు.
- 50 ఏళ్ల క్రితం 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పో వేదికగా శానియో ఎలక్ట్రిక్ కో (ప్రస్తుత పానసోనిక్) ఈ తరహా వాషింగ్ మెషీన్ మోడల్‌ను తొలిసారి తయారుచేసింది. దానిలో అదనపు ఫీచర్లను జోడించి, అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చి కొత్త తరహా హ్యూమన్ వాషింగ్ మెషీన్‌ను రెడీ చేశారు.