Site icon HashtagU Telugu

Nothing Phone 2: కళ్ళు చెదిరే డిస్కౌంట్ తో ఆకట్టుకుంటున్న నథింగ్ ఫోన్.. అన్ని రూ. వేల తగ్గింపుతో!

Mixcollage 19 Jul 2024 01 07 Pm 4621

Mixcollage 19 Jul 2024 01 07 Pm 4621

లండన్ కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే తాజాగా నథింగ్ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్ ను అందిస్తోంది నథింగ్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం నథింగ్‌ ఫోన్‌ 2 ని గత ఏడాది మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే.

నథింగ్ ఫోన్‌2 లాంచింగ్ సమయంలో ధర రూ. 44,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ పై భారీ డిస్కౌట్‌ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై ఏకంగా రూ.16,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అన్ని బ్యాంక్‌ ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్‌ రూ. 28,999కే లభిస్తోంది. దీంతో పాటు మీ పాత ఫోన్‌ ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోడం ద్వారా కూడా అదనంగా డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇకపోతే నథింగ్‌ ఫోన్‌ 2 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో ఎల్‌టీపీఓ ని కూడా అందించారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే..

ఈ స్మార్ట్ ఫోన్‌ లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌లో 4700 ఎమ్‌ఏహెచ్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీని కూడా అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో స్ప్లాష, వాటర్‌ అండ్‌ డస్ట్ రెస్టిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ ను కూడా ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే ఫేస్‌, ఫిగర్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను ఇచ్చారు. డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌5ని అందించారు.