Site icon HashtagU Telugu

Huawei Mate XT: మార్కెట్ లోకి హువాయ్ ఫోన్.. ఏకంగా మూడు సార్లు మడత పెట్టవచ్చట?

Huawei Mate Xt

Huawei Mate Xt

ఇటీవల కాలంలో మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లకు క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి చాలా రకాల ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు వచ్చిన స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే మనం ఫోల్డ్ చేయవచ్చు. కానీ తాజాగా మార్కెట్ లోకి విడుదల అయిన స్మార్ట్ ఫోన్ మాత్రం ఏకంగా మూడుసార్లు ఫోల్డ్ చేయవచ్చట. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. దాదాపు ఒక ట్యాబ్‌ సైజ్‌లో ఉండే ఈ ఫోన్‌ను మడతపెట్టడం ద్వారా సాధారణ ఫోన్‌ లాగా మారుతుందట.

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ హువాయ్‌ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. హువాయ్‌ మేట్‌ ఎక్స్‌టీ పేరుతో ఈ ఫోన్‌ ను తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే మొదటి ట్రై ఫోల్డ్‌ ఫోన్‌ గా ఇది నిలవనుంది. సెప్టెంబర్‌ 10వ తేదీన ఈ ఫోన్‌ ను అధికారికంగా లాంచ్‌ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫోన్‌ కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ఈ ఫోన్‌ ను సుమారు 7 లక్షల మందికి పైగా బుకింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ ఫోన్‌ ను కంపెనీ 16జీబీ ర్యామ్‌, 512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 16జీబీ ర్యామ్‌, 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్స్‌ లో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇకపోతే ఈ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ ధర ఏకంగా రూ. 1.77 లక్షలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మూడు స్క్రీన్స్‌ తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా అందించారు. అలాగే ఈ ఫోన్‌ ను పవర్‌ ఫుల్ ప్రాసెసర్‌ తో అందించనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అధిక కెపాసిటీ బ్యాటరీ, 5జీ కనెక్టివిటీ, అద్భుతమైన కెమెరా సెటప్‌ తో పాటు వాటర్‌ రెసిస్టెంట్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.