5G and How to Use it: 5జీ వాడుకోవాలంటే ఇలా చేయండి.!

భారత్‌లో ప్రధాని మోదీ 5జీ నెట్‌వ‌ర్క్‌ సేవలను ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 07:10 AM IST

భారత్‌లో ప్రధాని మోదీ 5జీ నెట్‌వ‌ర్క్‌ సేవలను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని 8 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. త్వరలో దేశమంతా ఈ 5జీ అందుబాటులోకి రానుంది. అయితే వినియోగదారులు 5జీ ఫోన్ల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 5జీ ఫోన్ ఉండి, 5జీ కవరేజ్ ఉన్న నగరాల్లో ఉన్నవారు తమ మొబైల్ లో 5జీని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు.

మీ నగరంలో జియో, ఎయిర్‌టె్‌, వీఐల్లో ఏదో ఒక టెలికాం కంపెనీ 5జీని అందిచబోతోంది. మీ మొబైల్ లో 5జీని ఉపయోగించేందుకు తీసుకోవాల్సిన చర్యలెందో ఒక‌సారి తెలుసుకుందాం.

ముందుగా మీ ప్రాంతంలో 5జీ అందుబాటులో ఉందో లేదో చూడండి. ఇందుకోసం మీ మెబైల్ ఆపరేటర్ లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేసి 5జీ వివ‌రాలు తెలుసుకోండి. మీ ఏరియాలో 5జీ ఉన్నట్లైతే మీ మొబైల్ 5జీకి స‌పోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. 5జీ మొబైల్‌లో ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లి మొబైల్ నెట్ వర్క్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. అక్కడ సిమ్ 1 లేదా 2లో ఏ నెట్ వర్క్ ప్రొవైడర్ 5జీ అందిస్తున్నారో వారి సిమ్‌ను ఎంచుకోండి. అనంతరం ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్‌లోకి వెళ్లి 5G/4G/3G/2G (Auto) ఆప్షన్ ఎన‌బుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ మొబైల్ ఆటోమేటిగ్గా 5జీ సేవలను అందించడం ఆరంభిస్తుంది.

అయితే 5జీ సేవ‌ల‌ను వాడాలంటే కొత్త సిమ్ తీసుకోవాలా..? అని చాలా మంది డౌట్ ప‌డుతున్నారు. అయితే 5జీకి కొత్త సిమ్ అవ‌స‌రం లేదని.. పాత సిమ్ ఉంటే స‌రిపోతుంద‌ని టెలికాం కంపెనీలు చెప్తున్నాయి. కొన్ని ఆప‌రేట‌ర్లు మాత్రం కొత్త సిమ్ కావాల‌ని అంటున్నాయి. క‌చ్చితంగా 5జీకి స‌పోర్ట్ చేసే మొబెల్ మాత్రం ఉండాల‌ని తెలిపాయి. కొన్ని కంపెనీలు ఇప్ప‌టికే రూ. 15వేల‌లోపు 5జీ ఫోన్లు లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.