WhatsApp: వాట్సాప్ లో చాట్ జీటీపీని ఉపయోగించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్లను విడుదల చేస్తూనే ఉంది.

  • Written By:
  • Publish Date - January 18, 2023 / 07:30 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను అప్డేట్లను విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఈ ఏడాది ప్రారంభం నుంచే కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ కి సంబంధించి మరొక ఆసక్తికర వార్త. చాట్ జీపీటీ.. ఈ ఫీచర్ చాట్ బాట్ అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపేస్తే ఎలా అయితే పనిచేస్తుందో అలా చాట్ జీపీటీ పనిచేస్తుంది. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్ అని అర్థం.

అనగా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఇది దేని గురించైనా మనుషులకు కావలసినట్లు మాట్లాడగలదు. అంతేకాకుండా ప్రోగ్రామ్స్ రాసి ఇవ్వడం, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను క్షణాల్లోనే సాల్వ్ చేసి ఇవ్వడం అన్నది ఈ చాట్ జీపీటీ ప్రత్యేకత. వాట్సాప్ బిజినెస్ APIలో నమోదు చేసుకోండి.చాట్ కోసం ఫ్లోను సృష్టించండి. చాట్ బిల్డర్‌ని ఉపయోగించి
మీ చాట్‌బాట్‌ని పరీక్షించాలి. ఆ తరువాత తర్వాత, మీ ఫోన్‌లో API చాట్‌బాట్‌ని ఇన్‌స్టాల్ చేసి తర్వాత, OpenAI ఖాతాను సృష్టించాలి. అనంతరం API కీల పేజీకి వెళ్ళి కొత్త రహస్య కీని సృష్టించాలి. దాన్ని మీ వాట్సాప్ బోట్‌కి కనెక్ట్ చేయడానికి OpenAI APIని ఉపయోగించాలి.

ఇప్పుడు వాట్సాప్ APIని ఉపయోగించి, చాట్‌జిపిటి వాట్సాప్ వినియోగదారులు బాట్‌ను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అనుమతిస్తుంది. ఈ విధంగా మీరు చాట్‌జిపిటి వాట్సాప్ బాట్‌ను సృష్టించవచ్చు. కాగా చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ అటువంటి చాట్ బాట్ ఇది మీ ప్రశ్నలకు దాదాపు ఖచ్చితమైన సమాధానాలను ఇస్తుంది. అంతేకాకుండా ఇది గూగుల్ నుంచి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా లింక్‌లను ఇవ్వదు. ఇందుకు బదులుగా ఇది నేరుగా మీ ముందు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను అందిస్తుంది.