ఈ రోజుల్లో ఆధార్ కార్డు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అలాగే ప్రభుత్వం ప్రైవేటు పనులకు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జర్నీ చేయాలి అన్నా సరే ఆధార్ కార్డు తప్పనిసరి.. మరి అలాంటి ఆధార్ కార్డులో చిన్నచిన్న తప్పులు ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవడం తప్పనిసరి. అటువంటి వాటిలో అడ్రస్ కూడా ఒకటి. మనం కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరొక ఊరికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు అడ్రస్ మార్చుకోవడం అన్నది తప్పనిసరి.
మరి మీరు కూడా ఆధార్ కార్డులో అడ్రస్ ని మార్చుకోవాలి అనుకుంటే ఆన్లైన్ లో ఆఫ్లైన్లో అడ్రస్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మొదట (https://myaadhaar.uidai.gov.in/) లింక్ లో మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయాలి. తర్వాత అడ్రస్ అప్‌డేట్ నావిగేట్ చేయాలి. మై ఆధార్ ట్యాబ్‌ని ఆపైఅప్డేట్ ఆధార్ ఆప్షన్ ట్యాప్ చేసి ఆ తర్వాత అప్డేట్ అడ్రస్ ఆన్లైన్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ వివరాలను ఎంటర్ చేయాలి. ఇంటి నంబర్/పేరు, వీధి, ప్రాంతం, గ్రామం/పట్టణం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్‌తో సహా మీ కొత్త అడ్రస్ సమాచారంతో ఫారమ్‌ను ఫిల్ చేయాలి.
మీ అడ్రస్ ప్రూఫ్ కచ్చితత్వం, స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలి. మీ పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా యుటిలిటీ బిల్లు వంటి అడ్రస్ డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యే రుజువును స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరు ఎంటర్ చేసిన అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆపై మీరు ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ ని అందుకుంటారు. మై ఆధార్ పోర్టల్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ URNని ఉపయోగించాలి.
ఇకపోతే ఆన్లైన్లో ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని గుర్తించి, యూఐడీఏఐ వెబ్‌సైట్ నుంచి ఆధార్ అప్‌డేట్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసి నింపాలి. మీరు ఏఎస్‌కే వద్ద కూడా పొందవచ్చు. తర్వాత ఏఎస్‌కే అధికారులకు చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్ తో పాటు పూర్తి చేసిన ఫారమ్ ను సమర్పించాలి. అథెంటికేషన్ కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. తర్వాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ ని కలిగి ఉన్న రసీదు స్లిప్‌ను పొందవచ్చు. మీ అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయడానికి లేదా యూఐడీఏఐ హెల్ప్‌లైన్ (1948)కి కాల్ చేయడం ద్వారా ఈ ఎస్ఆర్ఎన్ ఉపయోగించాలి.