Smartphone Hack: మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని అనుమానంగా ఉందా..అయితే ఇలా తెలుసుకోండి!

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుత

  • Written By:
  • Publish Date - September 1, 2022 / 12:36 PM IST

టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం కూడా అంతకంతకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయి అంటే స్మార్ట్ ఫోన్ కొద్దిసేపు కనిపించకపోతే పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తూ ఉంటారు. కేవలం సిటీలలో మాత్రమే కాకుండా పల్లెటూర్లలో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగాలు పూర్తిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. కాగా ఈ మధ్యకాలంలో ఫోన్ హ్యాక్ అవుతున్న కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఫోన్ హ్యాక్ అయితే మీ ఆన్లైన్ ఖాతాల్లో ఉన్న డబ్బులు అన్నీ కూడా మాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లో ఉన్న డేటాని మొత్తం దుర్వినియోగం చేసుకొని, మన విషయాలు అన్నీ తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే వెంటనే మీ ఫోన్ హ్యాక్ చేయబడిందో లేదో తెలుసుకోవచ్చు.
కాగా మీకు షాపింగ్ లేదా బ్యాంకింగ్ లావాదేవీల గురించి సందేశాలు వస్తున్నట్లయితే కచ్చితంగా మీ ఫోన్ హ్యాక్ అయ్యిందని అర్థం చేసుకోండి. అలాగే మీ స్మార్ట్‌ ఫోన్‌లో వచ్చే ప్రతి మెసెజ్‌ను జాగ్రత్తగా చదవండి. కానీ కొంతమంది మెసేజ్ లను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకవేళ బ్యాంకు లేదా షాపింగ్ లాంటి మెసెజ్‌ కనిపిస్తే వెంటనే మీ కార్డ్, బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేయండి.

మీ ఫోన్ తరచుగా ఆఫ్ అవుతూ లేదా రీస్టార్ట్ అవుతూ ఉంటే, మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక ఇటువంటి సమయంలో వెంటనే డేటాను బ్యాకప్ చేయండి. అయితే స్మార్ట్ ఫోన్‌ను చాలాసార్లు హ్యాక్ చేసిన తర్వాత ఫోన్‌లో ఉన్న యాంటీ వైరస్‌ను ఆఫ్ చేస్తు ఉంటారు సైబర్ నేరగాళ్ళు. అయితే ఒకవేళ ఫోన్‌లో ఉన్న యాంటీ వైరస్ పని చేయకపోతే ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ చాలా నెమ్మదిగా పనిచేస్తుంటే, అప్రమత్తంగా ఉండండి. ఇది కూడా ఫోన్ హ్యాక్ అయిందనడానికి సంకేతం కావచ్చు.