Site icon HashtagU Telugu

WhatsApp: ఫోన్‌లో కాంటాక్ట్ సేవ్‌ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చట.. ప్రాసెస్ విధానం ఇదే?

Mixcollage 27 Feb 2024 02 48 Pm 4840

Mixcollage 27 Feb 2024 02 48 Pm 4840

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. కాగా వాట్సాప్ రీసెంట్ టైమ్‌లో చాలా ఫీచర్లు పరిచయం చేసింది.

వాటిలో సేవ్‌ చేయకుండానే అన్‌నౌన్ నంబర్లకు మెసేజ్ పంపించే ఫీచర్ ఒకటి. ఈ స్పెసిఫికేషన్‌తో ఫోన్‌లో కొత్త కాంటాక్ట్స్ సేవ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఫాస్ట్‌గా, ఈజీగా మెసేజ్ పంపవచ్చు. అయితే కొందరికి ఈ ఆప్షన్ ఎలా ఉపయోగించాలో తెలియడం లేదు. మరి కాంటాక్ట్స్ సేవ్ చేయకుండా వాట్సాప్‌లో మెసేజ్‌లు ఎలా పంపాలో తెలుసుకుందాం.. ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ యాప్ ఓపెన్‌ చేయాలి. హోమ్ పేజీలో ఉన్న చాట్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. కాంటాక్ట్ లిస్ట్‌ కనిపిస్తుంది. స్క్రీన్ టాప్‌లో సెలెక్ట్ కాంటాక్ట్ పక్కన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి అన్‌నౌన్ నంబర్ టైప్ చేయాలి. ఆ నంబర్ కాంటాక్ట్, పక్కన చాట్ బటన్ ప్రత్యక్షమవుతుంది.

చాట్‌పై నొక్కి మెసేజ్ పంపించవచ్చు. వాట్సాప్ iOS ఉపయోగిస్తుంటే, చాట్ లిస్ట్‌లోని “స్టార్ట్ న్యూ చాట్” బటన్‌పై నొక్కాలి. సెర్చ్ బార్‌లో తెలియని ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అలాగే ఈ మెథడ్ నచ్చకపోతే http://wa.me/91XXXXXXXXXX ఫార్మాట్‌తో చాట్ లింక్‌ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ 91XXXXXXXXXXలో X’s ప్లేస్‌లో రిసీవర్ నంబర్‌ను టైప్ చేయాలి. ఈ లింక్‌ను కాపీ చేసి బ్రౌజర్ సెర్చ్ బార్‌లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే అన్‌నోన్ కాంటాక్ట్‌తో చాట్ స్టార్ట్ అవుతుంది. వాట్సాప్ క్లిక్-టు-చాట్ ఫీచర్‌ను ఉపయోగించే వెబ్‌సైట్లు ఉన్నాయి. నంబర్‌ను ఇన్‌పుట్ చేసి ఫోన్ లేదా కంప్యూటర్‌లో చాట్ విండోను ఓపెన్‌ చేయవచ్చు. లేదంటే వాట్సాప్‌లో సొంత నంబర్ తో చాట్ ఓపెన్‌ చేసి అన్‌నోన్ నంబర్‌ టైప్ చేసి సెండ్ బటన్‌పై నొక్కాలి.

అన్‌నోన్ నంబర్‌ చాట్‌లో క్లిక్ చేయగల లింక్‌గా బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. దానిపై నొక్కి చాట్‌ విత్ +91XXXXXXXXXX ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా ఎవరైనా డెలివరీ బాయ్స్, లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా అడ్రస్ అడిగితే వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేయాలనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో ఇంటరాక్షన్ వన్-టైమ్ ఈవెంట్ కావచ్చు. కాబట్టి నంబర్‌ను శాశ్వతంగా సేవ్ చేయాల్సిన అవసరం రాదు. అప్పుడు కేవలం సింగిల్ ట్యాప్‌తో లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌లో అన్‌నౌన్ నంబర్‌ను సేవ్ చేయాల్సిన అవసరం రాదు.