Site icon HashtagU Telugu

WhatsApp: ఫొటోస్ పంపడానికి కష్టపడుతున్నారా.. అయితే వాట్సాప్ లో హెచ్‌డీ ఫోటోలను పంపడిలా?

WhatsApp New Feature

WhatsApp New Feature

ప్రస్తుత రోజుల్లో వాట్సాప్ వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరు వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో వాట్సాప్‌ ను వినియోగిస్తున్నారు. వినియోగదారులను కూడా పెంచడం కోసం వాట్సాప్‌ సంస్థ కూడా ఎన్నో రకాల ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ వీటితో పాటు మరికొన్ని ఫీచర్స్ ని తీసుకువస్తూనే ఉంది.

మాములుగా మనం వాట్సాప్ ద్వారా మన కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఫోటోలను పంపినప్పుడు ఫోటోల నాణ్యత చాలా తక్కువగా ఉండటం గమనించే ఉంటాం. మరి వాట్సాప్ లో హెచ్డీ ఫోటోలను ఎలా పంపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్‌ లో డిఫాల్ట్ సెట్టింగ్‌లు ఉన్నాయి. స్టోరేజ్‌ని ఆదా చేయడంతో పాటు ఇంటర్నెట్ డేటా వినియోగాన్ని తగ్గించడానికి ఈ సెట్టింగ్ చేశారు. కానీ మనం మంచి క్వాలిటీ ఫోటోలను పంపినప్పుడు, ఈ సెట్టింగ్ ఫోటోల నాణ్యతను తగ్గిస్తుంది. మీరు హెచ్డీ లో ఫోటోలను పంపడానికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. మరి ఇంతకీ వాట్సాప్‌ లో హెచ్‌డీ ఫోటోలను ఎలా పంపాలి? అన్న విషయానికి వస్తే.. వాట్సాప్‌లో హెచ్‌డీలో ఫోటోలను పంపే విధానం చాలా సులభం. ఈ దశలను అనుసరించాలి.

మీరు హెచ్‌డీ ఫోటోను పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్‌ చాట్‌ ను ఓపెన్‌ చేయాలి. ఇప్పుడు అటాచ్‌మెంట్ ఐకాన్‌ కి వెళ్లి, మీ ఫోన్ గ్యాలరీ నుండి ఫోటోను ఎంచుకోవాలి. మీరు ఫోటోను ఎంచుకున్నప్పుడు మీకు హెచ్‌డీ ఎంపిక కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంచుకున్న తర్వాత హై డెఫినిషన్ ఫోటో షేరింగ్ కనిపిస్తుంది. అలాగే మెరుగైన నాణ్యత గల ఫోటోలను పంపవచ్చు. కాగా మీరు హెచ్‌డీ ఫోటోను పంపినప్పుడు అది హెచ్‌డీ అని లేబుల్ చేయబడుతుంది. వాట్సాప్ ద్వారా ఫోటోలను షేర్ చేయడం ద్వారా మీకు హెచ్‌డీని ఎంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇది హై డెఫినిషన్ ఫోటోలను షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటే లేదా డేటాను సేవ్ చేయాలనుకుంటే, మీరు ఫోటో నాణ్యతను ఎంచుకోవచ్చు.