Mobile Data: మొబైల్ డేటా త్వరగా అయిపోతోందా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే?

రోజు రోజుకి ఇంటర్నెట్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే ధరలు పెరుగుతున్నా కూడా వినియోగదారులు ఏమాత్రం తగ్గకుండా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తూ

  • Written By:
  • Updated On - December 1, 2023 / 04:09 PM IST

రోజు రోజుకి ఇంటర్నెట్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అయితే ధరలు పెరుగుతున్నా కూడా వినియోగదారులు ఏమాత్రం తగ్గకుండా ఇంటర్నెట్ ని ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నప్పుడు మొబైల్ డేటా చాలా త్వరగా అయిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో చాలామంది అసలు డేటా దేనికి ఉపయోగించారో కూడా తెలియక తికమక పడుతూ ఉంటారు. అయితే మీరు కూడా అలాంటి సమస్యతో బాధపడుతుంటే చింతించకండి. ఎందుకంటే మీకోసం సింపుల్ డేటా సేవింగ్ టిప్స్ తీసుకోవచ్చాము. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మామూలుగా స్మార్ట్ ఫోన్లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఇంటర్నెట్ డేటా త్వరగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ ఆప్షన్ ను ఆఫ్ చేయాలి. అలాగే వైఫై ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే కేవలం యాప్స్ ని అప్డేట్ చేయడం మంచిది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో డేతా సేవింగ్ మోడ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉన్నవారు ఆప్షన్ ని ఎనేబుల్ చేస్తే డేటాను సేవ్ చేసుకోవచ్చు. డేటా సేవింగ్ మోడ్ ఫీచర్ సహాయంతో, వీలైనంత ఎక్కువ డేటాను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల గూగుల్ మ్యాప్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ గూగుల్ మ్యాప్స్ డేటాను ఎక్కువగా వినియోగిస్తాయి.

అయితే గూగుల్ యాప్ లను ఆన్లైన్ మోడ్ లో కాకుండా ఆఫ్లైన్ మోడ్ లో ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్ ని కొంతవరకు ఆదా చేయవచ్చు. వాట్సాప్‌లో కనిపించే ఫోటోలు, వీడియోలు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవ్వడం డేటా అయిపోవడానికి మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఎంపిక నుండి వీడియోలు, ఫోటోలను తీసివేయాలి. లేదంటే డేటా వేగంగా అయిపోతుంది. అలాగే ప్రయాణాలు సమయంలో ఎక్కువగా ఓటీడీ ప్లాట్‌ఫారమ్‌లు వీడియోలు యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు. అయితే ప్రయాణం సమయంలో సమీపంలో వైఫై అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మొబైల్ డేటాను సేవ్ చేయవచ్చు. అలా డౌన్లోడ్ అయిన వాటిని ఖాళీ సమయాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో చూడవచ్చు.

Follow us