Washing Machine : మీ వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తుందా..? అయితే ఇలా చెయ్యండి..!!

వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన రావడం. ఇలా ఎందుకు వస్తుందో తెలియక చాలామంది ఈ వాషింగ్ మెషిన్ కంపెనీ మంచిది కాదని..బట్టల వల్లే ఆలా వస్తుంది కావొచ్చు

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 06:44 AM IST

పూర్వకాలంలో ఎవరి బట్టలు వారే ఉత్తుకోవడం..లేదా చాకలి వారు ఉతుకడం చేసేవారు..కానీ ఇప్పుడు ఆలా కాదు ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్ (Washing Machine) ఉంది..ఇద్దరు ఉన్న ఇంట్లో ఉంది..పది మంది ఉన్న ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది. దీంతో చాలామంది బట్టలు ఉతకడం అనేది మరచిపోయారు. రెండు , మూడు రోజులైన సరే..వాషింగ్ మెషిన్ లో వేస్తున్నారు తప్ప చేతితో ఉతకడం అనేది చేయడం లేదు. అయితే చాలామంది ఇళ్లలోని వాషింగ్ మెషిన్లలో ఓ సమస్య మాత్రం తరుచు వినిపిస్తుంది. అదే వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన (Bad Smell ) రావడం. ఇలా ఎందుకు వస్తుందో తెలియక చాలామంది ఈ వాషింగ్ మెషిన్ కంపెనీ మంచిది కాదని..బట్టల వల్లే ఆలా వస్తుంది కావొచ్చు..అని మరికొన్ని కారణాలతో చెపుకొస్తుంటారు.

అసలు వాషింగ్ మెషిన్‌ నుండి దుర్వాసన రావడం కారణం..వాషింగ్ మెషిన్ ను నెలకోసారి శుభ్రం చేయకపోవడం వల్లే. ప్రతినెలా వాషింగ్ మెషిన్ శుభ్రం చేయకపోతే దుర్వాసన రావడంతో పాటు మెషిన్ కూడా త్వరగా పాడైపోతుంది. అందుకే ఒకవేళ మీ వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన వస్తే ఇలా చెయ్యండి..దుర్వాసన అనేది పోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

నిమ్మకాయ : వాషింగ్ మెషిన్ దుర్వాసన పోగొట్టడంలో నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. దీని కోసం నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేసి వాషింగ్ మెషీన్ డ్రమ్‌లో ఉంచండి. నిమ్మకాయలోని ఆమ్లత్వం క్రిములను చంపుతుంది కాబట్టి దుర్వాసన అనేది పోతుంది.

వెనిగర్ : వాషింగ్ మెషిన్ డ్రమ్‌లో వెనిగర్ పోసి ఆన్ చేసి.. ఆ తర్వాత కాసేపటికి అరకప్పు బేకింగ్ సోడా వేసి మళ్లీ ఆన్ వేయండి. ఈ రెండిటి కారణంగా డ్రమ్ క్లిన్ కావడమే కాకుండా దుర్వాసన అనేది కూడా పోతుంది.

అలాగే వేడి నీరు : వాషింగ్ మెషిన్ నుండి దుర్వాసన తొలగించడానికి గోరు వెచ్చని వేడి నీరు కూడా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో సబ్బు వేసి, వాషింగ్ మెషీన్‌లో పోయాలి. 5 నిమిషాలు తర్వాత.. మెషిన్‌లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

Read Also : Medigadda Pillar Damage : మేడిగడ్డ పిల్లర్ డ్యామేజ్ పై నోరు విప్పిన కేసీఆర్