Gmail Password Recover: మీరు కూడా జిమెయిల్ పాస్‌వర్డ్‌ మర్చిపోయారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

జీమెయిల్ పాస్వర్డ్ ని మరిచిపోయి ఎలా రికవరీ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారు ఈ చిన్న టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Gmail Password Recover

Gmail Password Recover

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. కొత్త మొబైల్ ఫోన్ కొన్నప్పుడు జీమెయిల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొత్త కొత్త జిమెయిల్ ఐడి లను కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు. అయితే జిమెయిల్ ఐడి క్రియేట్ చేసుకునేటప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు పాస్వర్డ్ సెట్ చేసి ఆ తర్వాత మర్చిపోవడం. ఆ క్షణం ఏదో ఒక పాస్వర్డ్ పెట్టేది తర్వాత దానిని రికవరీ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా చాలామంది జీమెయిల్ పాస్వర్డ్ ని మర్చిపోతూ ఉంటారు.

అయితే మీరు మీ జిమెయిల్ పాస్‌వర్డ్‌ ను మరచిపోయినట్లయితే భయపడాల్సిన అవసరం లేదట. కొన్ని సులభమైన దశలను అనుసరించడం ద్వారా మీరు మీ జిమెయిల్ ఖాతాను నిమిషాల్లో మళ్లీ యాక్సెస్ చేయవచ్చని చెబుతున్నారు. ఇంతకీ జిమెయిల్ పాస్వర్డ్ ని ఎలా రీసెట్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా మీ బ్రౌజర్‌ లో గూగుల్ ఖాతా రికవరీ పేజీని ఓపెన్ చేయాలి..ఇక్కడ మీరు మీ జిమెయిల్ చిరునామాను నమోదు చేసి నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. గూగుల్ ముందుగా మీ మునుపటి పాస్‌వర్డ్‌ను అడుగుతుంది. మీకు గుర్తు ఉంటే, దాన్ని నమోదు చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు పాత పాస్‌వర్డ్ గుర్తులేకపోతే, మరొక మార్గంలో ప్రయత్నించండి అనే ఆప్షన్‌ ను ఎంచుకోవాలి.

అంటే ఫర్గోట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. గూగుల్ మీ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ కు ఓటీపీ ని పంపుతుంది. ఆ ఓటీపీ ని నమోదు చేయాలి. మీకు మీ మొబైల్ నంబర్‌ కు యాక్సెస్ లేకపోతే గూగుల్ మీ బ్యాకప్ ఇమెయిల్‌ కి ధృవీకరణ లింక్‌ ను పంపుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు భద్రతా ప్రశ్నలకు సమాధానమిచ్చే ఎంపికను కూడా పొందవచ్చట. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించే ఎంపికను పొందుతారు. బలమైన, మీరు సులభంగా గుర్తుంచుకోగలిగే కొత్త పాస్‌వర్డ్‌ ను ఎంచుకోవాలి. నిర్ధారించు అనే ఆప్షన్‌ పై క్లిక్ చేసిన తర్వాత మీ పాస్‌వర్డ్ రీసెట్ చేయబడుతుంది. ఇలా చేస్తే వెంటనే మీ పాస్వర్డ్ రికవరీ అవుతుంది.

  Last Updated: 04 Feb 2025, 04:37 PM IST