Site icon HashtagU Telugu

WhatsApp Block: మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా.. వెంటనే అన్‌బ్లాక్‌ చేయండిలా!

WhatsApp New Feature

WhatsApp New Feature

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ వినియోగదారుల భద్రత కోసం ప్రైవసీని కాపాడేందుకు ఇప్పటికే ఎన్నో రకాల మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ వినియోగదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తోంది. యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులను దుర్వినియోగం చేసిన వారి ఖాతాలను కూడా బ్లాక్ చేస్తుంది. వాట్సాప్ పాలసీని ఉల్లంఘిస్తే, కంపెనీ ఖాతాను బ్లాక్ చేస్తుంది లేదా బ్యాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాలలో వ్యక్తుల వాట్సాప్ ఖాతాలను ఎటువంటి పొరపాటు లేకుండా నిషేధించవచ్చు.

అటువంటి పరిస్థితిలో మీ ఖాతా కూడా ఎటువంటి పొరపాటు లేకుండా నిషేధించబడితే, ఈ ప్రక్రియను అనుసరించి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. అలా మీ వాట్సాప్ ఖాతా నిషేధించబడినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ వాట్సాప్ అకౌంట్ ఎందుకు బ్లాక్ అయ్యింది అన్న విషయాన్ని ఆ నోటీసు వివరిస్తుంది. వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. సమాజంపై ప్రతికూల ప్రభావం చూపే సందేశాలను పంపడం, వాట్సాప్ ద్వారా అభ్యంతరకరమైన సమాచారాన్ని పంచుకోవడం మొదలైన వాటి కోసం మీ ఖాతా బ్లాక్ చేయవచ్చు. మీ వాట్సాప్‌ ఖాతా పొరపాటున నిషేధించబడితే మీరు వాట్సాప్‌ మద్దతు బృందాన్ని సంప్రదించవచ్చు.

యాప్‌ కి వెళ్లి హెల్ప్ ఎంపిక పై క్లిక్ చేయాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఇమెయిల్ ద్వారా నివేదించవచ్చు. మీ సంప్రదింపు నంబర్, పూర్తి వివరాలు, మీ ఖాతాను నిషేధించడానికి గల కారణాన్ని ఇమెయిల్‌ లో పంపండి. కొన్నిసార్లు వాట్సాప్‌ మీ ఖాతాను తాత్కాలికంగా నిషేధించవచ్చు. ఈ పరిమితిని 24 గంటల నుండి 30 రోజులలోపు పరిష్కరించవచ్చు. మీరు ఈ కాలంలో జీబీ వాట్సాప్ , వాట్సాప్ ప్లస్ వంటి థర్డ్ పార్టీ వాట్సాప్‌ ని ఉపయోగించకూడదు. ఈ తాత్కాలిక నిషేధానికి ఈ వేదికలు కూడా కారణం అవుతాయి.