Site icon HashtagU Telugu

Twitter : ట్విట్టర్ లో మరో సరికొత్త ఫీచర్…ఏంటంటే…!

Twitter Spaces

Twitter Spaces

ప్రపంచంలో అత్యంత పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ గా ట్విట్టర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ ఇప్పుడు మరోకొత్త ఫీచర్ తో ముందుకు వచ్చింది. తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు గతేడాది ట్విట్టర్ స్పేసెస్ అనే ఆడియో గ్రూప్ చాట్ ఫీచర్ను పరిచయం చేసిన విషయం తెలసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఆన్ లైన్ ద్వారా ఆడియో డిస్కషన్స్ చేయవచ్చు. ఇది క్లబ్ హౌస్ ఆడియో చాట్ ఫీచర్ లా పనిచేస్తుంది. అయితే ఇందులో చర్చలను రికార్డింగ్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ట్విట్టర్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. లెటెస్టుగా ఈ సంస్థ స్పేసెస్ రికార్డింగ్ ఫీచర్ను పరిచయం చేస్తుంది.

అయితే ఈ ట్విట్టర్ స్పేసెస్ లో పలు రంగాలకు చెందిన ప్రతిభావంతులు, జనాదరణ పొందిన ప్రముఖులు పాల్గొంటారు. వారు పలు విషయాలు గురించి సుదీర్ఘంగా చర్చిస్తారు. కేవలం ఆడియో రూపంలోనే కాదు ఫోటోలు, వీడియోలతో చర్చలు జరుగుతాయి. ఫాలోవర్లను ఆ చర్చల్లో  నిమగ్నం అయ్యేలా చేస్తారు. అందుకే స్పేసెస్ గత కొంత కాలంగా ప్రాచుర్యం పొందాయి. లెటెస్ట్ అప్ డేట్ ప్రకారం ట్విట్టర్ యూజర్లు ఇప్పుడు కేవలం హోస్ట్ చేయడమే కాదు స్పేసెస్ ను రికార్డు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రికార్డింగ్ ఫీచర్ తో వ్యక్తుల స్క్రీన్ను రికార్డు మనకు నచ్చిన సమయంలో చూడవచ్చు.

ట్విట్టర్ స్పేస్ కార్డ్ లో ప్లే రికార్డింగ్ బటన్ను నొక్కడం ద్వారా మీరు రికార్డ్ చేసిన సంభాషణను ప్లే చేసుకోవచ్చు. అయితే ఇవి ఎప్పటికీ అందుబాటులో ఉండవు. మీరు రికార్డ్ చేసిన స్పేలు 30 నుంచి 120 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తర్వాత వాటిని ప్లే చేసే అవకాశం ఉండదు. ఈ ఫీచర్ను ఆండ్రాయి, ఐఓఎస్ రెండింటిలోనూ ఒకేసారి అందుబాటులోకి తెచ్చింది ట్విట్టర్ .

స్పేసెస్ ను ట్విట్టర్ నుంచి ఎలా రికార్డ్ చేయాలంటే..?

ట్విట్టర్ స్పేస్ ను హోస్ట్ చేస్తున్నప్పుడు యూజర్లు తప్పనిసరిగా రికార్డ్ స్పేస్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. దీని తర్వాత స్పేస్ రికార్డ్ మొదలైందని తెలియజేసే లోగో స్క్రీన్ పై కనిపిస్తుంది. మాట్లాడేవారు మాత్రమే ఈ స్పేస్ సెషన్లను రికార్డు చేసుకునే అవకాశం ఉంటుంది. స్పేస్ ముగిసిన తర్వాత ట్వీట్ ద్వారా స్పేస్ రికార్డింగ్ ను షేర్ చేసుకోవచ్చు. దీన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసే ముందు ఎడిట్ స్టార్ట్ టైమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా స్పేస్ ప్రారంభంలో అవసరం లేని చర్చను కట్ చేసుకోవచ్చు. మీ రికార్డింగ్ ను ప్లే చేయడానికి టైమ్ లైన్ కనిపించే ప్లే రికార్డింగ్ బటన్ పై క్లిక్ చేయవచ్చు. మీ డేటా ఫోల్డర్ లోని స్పేస్ ను కూడా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అంతేకాదు మీరు రికార్డ్ చేసిన స్పేస్ లను ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు.

Exit mobile version