Site icon HashtagU Telugu

Laptops Screen Recording: ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌ రికార్డ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

Laptops Screen Recording

Laptops Screen Recording

మామూలుగా మనం సమయం సందర్భానుసారం బట్టి మొబైల్ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేయడం లేదంటే స్క్రీన్ షాట్ తీయడం లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు ల్యాప్‌టాప్‌ లో కూడా స్క్రీన్ రికార్డు చేయడం లేదంటే స్క్రీన్ షాట్ లు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి లాప్టాప్ లో స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలి అన్న విషయం తెలియదు. మరి ల్యాప్‌టాప్‌ లో స్క్రీన్ రికార్డు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్మార్ట్‌ఫోన్‌ ల మాదిరిగానే ల్యాప్‌టాప్‌ లలో స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్‌ ను పొందుతాము. స్మార్ట్‌ఫోన్‌ లలో డిస్‌ప్లే టోగుల్ బార్‌ లో రికార్డింగ్ చిహ్నం అందుబాటులో ఉంటుంది.

కానీ ల్యాప్‌టాప్‌ లలో స్క్రీన్ రికార్డింగ్ కోసం ప్రత్యక్ష ఎంపిక ఉండదట. ల్యాప్‌టాప్‌ లో స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్‌ ను ఆన్ చేయడం చాలా సులభం. ఇందుకోసం మీరు కేవలం కొన్ని బటన్‌ లతో మొత్తం ల్యాప్‌టాప్ డిస్‌ప్లేను రికార్డ్ చేయవచ్చు. మీరు మీ కీబోర్డ్ 3 బటన్‌ లను ఉపయోగించాలి. స్క్రీన్ రికార్డింగ్‌ ను ప్రారంభించాలి. దీని కోసం మీరు షార్ట్‌ కట్ పద్ధతిని అనుసరించాలి. మీరు మీ ల్యాప్‌టాప్‌ లో Windows+Alt+R నొక్కితే రికార్డింగ్ ప్రారంభమవుతుంది. స్క్రీన్ రికార్డింగ్ ప్రారంభమైందో లేదో మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు. రికార్డింగ్ ప్రారంభమైనప్పుడు స్క్రీన్ కుడి వైపున పాస్ అవుతున్న సెకన్లు కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు మీ డిస్‌ప్లేలో చేసే ఏదైనా వీడియో ఫార్మాట్‌ లో రికార్డ్ చేయబడుతుంది.

అలాగే కొన్ని కొన్నిసార్లు మనం లాప్టాప్ లో పనిచేస్తున్నప్పుడు స్లో అవుతూ ఉంటుంది. దీంతో చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటప్పుడు మీరు ప్రతిసారి సర్వీస్ సెంటర్ ను సందర్శించాల్సిన అవసరం లేదు. ల్యాప్‌టాప్‌లో పనిచేసేటప్పుడు చాలా మంది ఐదు,ఆరు ట్యాబ్‌ లను తెరిచి ఉంచుతారు. కానీ ఇలా చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ సరిగా పనిచేయదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు మీ బ్రౌజర్‌ లో ఎన్ని ఎక్కువ ట్యాబ్‌ లను తెరిస్తే, ర్యామ్ లేదా ప్రాసెసర్ అంత ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటుంది. ఫలితంగా ఇది నెమ్మదిగా పని చేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి తక్కువ ట్యాబ్ లను ఓపెన్ చేయడం మంచిది