Site icon HashtagU Telugu

Aadhaar Ration Card Linking: రేషన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేశారా.. చేయకపోతే వెంటనే చేసేయండి!

Aadhaar Ration Card Linking

Aadhaar Ration Card Linking

సబ్సిడీలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి భారత ప్రభుత్వం వారి ఆధార్ కార్డును వారి రేషన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. మోసపూరిత రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించడం, రేషన్ ప్రయోజనాల పంపిణీని మెరుగుపరచడం కోసం దీనిని అమల్లోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఆధార్, రేషన్ కార్డుల లింకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ఇందుకోసం మీరు నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డుతో ఆధార్ను లింక్ చేయవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఇందుకోసం మొదట మీ రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ వెబ్సైట్ ను సందర్శించాలి. ఆధార్ లింక్ కోసం సంబంధిత విభాగాన్ని యాక్సెస్ చేయడానికి మీరు మీ క్రెడెన్షియల్స్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ ను మీ రేషన్ కార్డుకు లింక్ చేసే ఆప్షన్ ఎంచుకోవాలి. స్క్రీన్ పై కనిపించే సూచనలను అనుసరిస్తూ, మీ ఆధార్ నంబర్, రేషన్ కార్డు నంబర్ల వివరాలను నమోదు చేయాలనీ చెబుతున్నారు..

ముఖ్యమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. మీ గుర్తింపును ధృవీకరించడానికి, లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటిపిని నమోదు చేయాలి. ఆధార్, రేషన్ కార్డు లింకేజీ విజయవంతమైందని సూచిస్తూ మీ ఫోన్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అలాగే రేషన్ కార్డులో నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ రేషన్ ప్రయోజనాలను పొందడంలో అంతరాయం కలగకుండా ఉండటానికి వారి ఆధార్ ను వారి రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలి. ఆధార్ అథెంటికేషన్, మొబైల్ నంబర్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ తో కూడిన తప్పనిసరి కేవైసీ వెరిఫికేషన్ ను కూడా ప్రభుత్వం అమలు చేసింది. రేషన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించడంతో పాటు, ఆధార్ కార్డుపై పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి యుఐడిఎఐ అవకాశం కల్పించింది. మొదట డిసెంబర్ 14, 2024తో ముగియాల్సిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు జూన్ 14, 2025 వరకు పొడిగించారు.