Site icon HashtagU Telugu

Aadhaar-Voter ID: ఆధార్, ఓటర్ కార్డులను ఎందుకు లింక్ చేయాలి? లింక్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Aadhaar Voter Id

Aadhaar Voter Id

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు ఓటర్ కార్డుల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఈ రెండు కార్డులను ఎక్కడో ఒక చోట ఉపయోగిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు లింక్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా వీటి రెండింటికి చేయించుకోమని పదే పదే చెబుతూనే ఉంది. అసలు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డును లింక్ చేయడం ఎందుకు అవసరం? అన్న విషయానికి వస్తే.. భారతదేశంలో ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు చాలా ముఖ్యమైన పత్రాలుగా ఉన్నాయి.

అదే సమయంలో వాటిని ఉపయోగించి అనేక రకాల మోసాలు కూడా జరుగుతాయి. ముఖ్యంగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను ఉపయోగించి ఎన్నికల సమయంలో నకిలీ ఓట్లు కూడా వేస్తున్నారు. ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు అనుసంధానం చేసుకుంటే ఇలాంటి నేర సంఘటనలు తగ్గుతాయని చెబుతున్నారు. దీని అర్థం ఒక వ్యక్తికి ఒకే ఆధార్ కార్డు ఉండాలి. ఒక వ్యక్తి తన ఆధార్ కార్డును తన ఓటరు ఐడి కార్డుతో లింక్ చేస్తే, అతని వద్ద నకిలీ ఓటరు ఐడి కార్డు ఉంటే అది రద్దు చేస్తారు. అందుకే ప్రభుత్వం ఆధార్ ఓటరు గుర్తింపు కార్డును లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

ఆధార్, ఓటరు గుర్తింపు కార్డును ఎలా లింక్ చేయాలి? అన్న విషయానికి వస్తే.. మీరు ముందుగా NVSP వెబ్‌సైట్‌కి వెళ్లాలి. తరువాత అందులో మీ వివరాలను నమోదు చేయాలి. మీరు లాగిన్ అయి ఆధార్ కనెక్షన్ ఆప్షన్‌ ను ఎంచుకోవాలి. ఆపై మీరు ఫారం 6బి కి వెళ్లాలి. తర్వాత మీ ప్రొఫైల్‌ ను మీ ఓటరు ఐడి నంబర్‌ తో లింక్ చేయాలి. తరువాత మీరు మీ గుర్తింపును ధృవీకరించాలి. అలాగే మీరు అక్కడ అడిగిన వివరాలను జాగ్రత్తగా చూసి ఫిల్ చేయాలి. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డును మీ ఓటరు ఐడి కార్డుతో సులభంగా లింక్ చేసుకోవచ్చనీ చెబుతున్నారు.