Aadhaar Card: ఆధార్ కార్డు అసలైనదా లేక నకిలీదా అని గుర్తించడం ఎలా?

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 03:00 PM IST

భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే నేటి రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ వంటి సేవలతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. దాంతో ఆధార్ కార్డు అన్నది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే మరి అలాంటి ఆధార్ కార్డులో పేరు, డేటాఫ్ బర్త్,జెండర్, ఇంటి అడ్రస్ ఇలా ప్రతి ఒకటి కూడా కరెక్ట్ గా ఉండాలి.

ఒకవేళ అందులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. లేదంటే కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మీ వద్ద ఉన్న ఆధార్ కార్డు అసలైనదా? నకిలీదా అని తనిఖీ చేయడం ముఖ్యం. నకిలీ ఆధార్ కార్డు మీకు ప్రభుత్వ ప్రయోజనాలను దూరం చేయడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే మీ ఆధార్ కార్డ్ ప్రామాణికతను నిర్ధారించడానికి దాన్ని ధృవీకరించడం చాలా ముఖ్యం. మీ ఆధార్ కార్డ్‌ని ధృవీకరించడానికి మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఎంపికలలో దేనినైనా ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డ్‌ని జారీ చేసే బాధ్యత యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఉంది.

మరి ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ వెరిఫై చేయడం ఎలా? అన్న విషయానికి వస్తే.. అయితే ఇందుకోసం ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. అక్కడ మై ఆధార్ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆపై సర్వీస్ ఎంపిక నుండి ఆధార్ నంబర్‌ని ధృవీకరించాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇప్పుడు వెరిఫై ఆధార్ పై క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డ్ నిజమైనదైతే అది వెబ్‌సైట్‌లో EXISTS అని చూపుతుంది. అది ఫేక్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. మరి ఆధార్ కార్డ్‌ని ఆఫ్‌లైన్‌లో ఎలా ధృవీకరించాలి అన్న విషయానికి వస్తే.. మీరు ఆధార్ కార్డ్‌లోని డిజిటల్ సంతకాన్ని ధృవీకరించడానికి QR కోడ్ స్కానర్‌ని ఉపయోగించవచ్చు లేదా మీరు మై ఆధార్ యాప్ ద్వారా కార్డ్‌ను ప్రామాణీకరించవచ్చు. ఈ పద్ధతులు త్వరగా, సులభంగా ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ నిజమైనదని, అవసరమైన ఏవైనా సేవలకు అంగీకరించబడుతుందని నిర్ధారించుకోవాలి..