Whatsapp : వాట్సాప్ లో సరికొత్త అప్ డేట్…డీపీ, స్టేటస్..మీరు కావాలనుకున్నవారికే కనిపిస్తుంది..!!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్...తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 05:45 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్…తమ యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. సరికొత్త ఫీచర్లతో యూజర్ ఎక్స్ పిరియన్స్ ను మరింత అద్భుతంగా మార్చేందుకు డిఫరెంట్ గాట్రై చేస్తుంటుంది. ఇందులో భాగంగానే…వాట్సాప్ లో డీపీ (ప్రొఫైల్ పిక్చర్), మన గురించి సమాచారం, చివరిసారిగా వాట్సాప్ తెరిచినప్పుడు చేసిన సమయం వంటి ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు. లేదంటే మనకు సంబంధించిన సమాచారం అంతా కూడా అందరికీ కనిపిస్తుంటుంది. ఇక లాస్ట్ సీన్ స్టేటస్ కనపించకుండా మనం ఆపేసుకుంటే…మనకు కూమా మరెవరి లాస్ట్ సీన్ స్టేటస్ కనిపించదు. అంతేకాదు మనకు కావాల్సిన వారికే డీపీ, స్టేటస్ వంటివి కనిపించేలా మిగతావారికి కనబడకుండా ఉండేలా వాట్సాప్ సరికొత్త ఆప్షన్స్ ప్రవేశపెట్టింది. దీంతో మనం ఇతరుల స్టేటస్ కూడా చూడవచ్చు.

యూజర్ల వ్యక్తిగత సమాచారం గోప్యత కోసం కొన్ని ఆప్షన్లను ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్ ఈ మధ్యే ప్రకటించింది. దీనికోసం ప్రైవసీ సెట్టింగ్ లో నాలుగు రకాల ఆప్షన్లను కూడా ఇచ్చింది. ఏ ఆప్షన్ ఎంచుకుంటే..ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.

ఎవ్రీవన్:
మీ లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఎబౌట్, ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉన్నారా లేదా అనే సమాచారాన్ని అందరికీ చూపిస్తుంది.

మై కాంటాక్ట్స్ :
ఈ ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటే మనం పర్సనల్ సమాచారం కేవలం మన ఫోన్లో సేవ్ చేసుకున్న కాంటాక్టు నెంబర్ల వారికి మాత్రమే కనిపిస్తుంది.

మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ :

ఈ ఆప్షన్ లో కూడా మన సమాచారం ఫోన్లో సేవ్ అయి ఉన్న కాంటాక్టులకే మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇందులో ఏవైనా కొన్ని సెలక్ట్ చేసిన కాంటాక్ట్ నెంబర్ల వారికి మనం సమాచారం కనిపించకుండా చేసుకోవచ్చు.

నోబడీ;
దీన్ని సెలక్ట్ చేసుకుంటే లాస్ట్ సీన్ స్టేటస్, ప్రొఫైల్ ఫొటో, ఇతర సమాచారమేదీ కూడా ఎవరికీ కనిపించకుండా చేసుకోవచ్చు.