WhatsApp: వాట్సప్‌లో మీ ఆన్‌లైన్‌ స్టేటస్‌, ప్రొఫైల్‌ను ఇతరులు చూడకూడదంటే ఇలా చేయాల్సిందే?

ఇటీవల కాలంలో వాట్సాప్ సంస్థ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. నెలలో

Published By: HashtagU Telugu Desk
Mixcollage 20 Dec 2023 08 39 Pm 3998

Mixcollage 20 Dec 2023 08 39 Pm 3998

ఇటీవల కాలంలో వాట్సాప్ సంస్థ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తుంది. నెలలో కనీసం నాలుగు ఐదు ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది వాట్సాప్ సంస్థ. అలా ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ తాజాగా కూడా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని వినియోగదారులకు అందిస్తోంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. వాట్సప్‌లో ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచే ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. మీ ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరూ మిమ్మల్ని గుర్తించలేరు.

అంటే ఆన్‌లైన్‌లో ఎవరితో చాట్‌ చేస్తున్నా మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్ ఆన్‌లైన్ స్టేటస్‌ దాచడం వల్ల మీరు చివరిసారిగా వాట్సప్‌ చూసిన స్థితిని కూడా ఎవరూ గుర్తించలేరు. దానిని వాట్సప్‌లో సెట్ చేసుకోవల్సి ఉంటుంది. తద్వారా ఆన్‌లైన్ స్టేటస్ ఆటోమేటిక్‌గా నోబడీ అయిపోతుంది.వాట్సప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. అందులో లాస్ట్‌సీన్‌ అండ్‌ ఆన్‌లైన్ ఆప్షన్‌ను ఆఫ్‌ చేస్తే సరి. ఈ సెట్టింగ్‌ని ఆఫ్‌ చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరూ ఆన్‌లైన్‌లో చూడలేరు. అలాగే ఇతరుల ఆన్‌లైన్ స్థితిని కూడా మీకె చూడలేరు.

ఫలితంగా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో మరెవరికీ తెలియదు. అదేవిధంగా మీ ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరూ చూడకూడదని భావించేవారు కూడా సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అందుకు సెట్టింగ్స్‌లోని ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత ప్రొఫైల్‌ ఫొటో ఆప్షన్‌ వస్తుంది. దానిలో ఎవ్రి వన్‌, మై కాంటాక్ట్స్‌, మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్, నో బడి అని నాలుగు ఆప్షన్లు వస్తాయి. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

  Last Updated: 20 Dec 2023, 08:52 PM IST