Site icon HashtagU Telugu

whatsapp: వాట్సాప్ లో వాయిస్ కాల్స్ ఆఫ్ చేస్తున్నారా.. అయితే ఐపీ అడ్రస్ ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండిలా?

Mixcollage 14 Dec 2023 02 12 Pm 1532

Mixcollage 14 Dec 2023 02 12 Pm 1532

మామూలుగా మనం కొన్ని కొన్ని సార్లు నార్మల్ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఇతరులతో వైఫై కనెక్ట్ చేసుకుని వాయిస్ కాల్స్ చేస్తూ ఉంటాం. అలాగే నెట్వర్క్ సరిగా లేనప్పుడు కూడా ఎక్కువగా వాట్సాప్ లో వాయిస్ కాల్స్ మాట్లాడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో నార్మల్ కాల్స్ తో పోల్చుకుంటే వాట్సాప్ లోనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే వాట్సాప్ లో ఇతరులకు వాయిస్ కాల్ చేసినప్పుడు మన ఫోన్ ఐపి అడ్రస్ వాళ్లకు కనిపిస్తుంది. వాట్సాప్ కాల్ చేస్తున్నప్పుడు మీరు అడ్రస్ ను ఎక్కడా చూడలేరు. కానీ ఈ సమాచారం మొత్తం మీరు మాట్లాడుతున్న వ్యక్తికి చేరుతుంది.

ఇలాంటి సమయంలో భాగస్వామ్య ఐపీ చిరునామాలతో మాత్రమే వాయిస్ కాల్స్ లేదా వీడియో కాల్స్ చేయాలి. దీన్ని ఎలా ఆఫ్ చేయాలి అన్నది చాలా మందికి తెలియదు. ఇప్పటివరకు అలాంటి సౌకర్యం లేదు. అయితే, కంపెనీ ఇటీవల కొత్త అప్‌డేట్ల ద్వారా వాట్సాప్ గోప్యతను బలోపేతం చేసింది. కాబట్టి ఇకపై మీరు వాట్సాప్ కాల్ లేదా వీడియో కాల్ చేస్తున్నప్పుడు మీ ఐపీ అడ్రస్ ను గోప్యంగా ఉంచుకోవచ్చు. ఇకపోతే వాట్సాప్ కాల్స్‌లో IP అడ్రస్ ఎలా ఆఫ్ చేయాలి? అన్న విషయానికి వస్తే.. ముందుగా మీ వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

అనంతరం కిందికి స్క్రోల్ చేసి Advanced ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఒకవేళ మీరు వద్దనుకుంటే ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేయవచ్చు ఈ ఫీచర్ ఆన్ చేస్తే, యూజర్లు ఎవరికి ఆడియో కాల్ చేసినా లేదా వీడియో కాల్ చేసినా ఆ సర్వర్ లోని డేటా మాత్రమే చేరుతుంది. ఐపి అడ్రస్ ఇకపై అందుబాటులో ఉండదు. ఈ ఫీచర్ వల్ల మీ ఫోన్ ప్రైవసీ మెయింటెయిన్ అవుతుందని కంపెనీ ప్రకటించింది.వాట్సాప్ గ్రూప్ కాల్స్‌లో ఈ ఫీచర్ పని చేస్తుందా? ప్రస్తుతానికి ఈ ఫీచర్ one-on-one కాల్స్ కోసం మాత్రమే తీసుకొచ్చింది కంపెనీ. వాట్సాప్ గ్రూప్ కాల్స్ లో ఐపీ అడ్రస్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ ఫీచర్ ఆన్‌లో ఉంటే క్వాలిటీ తగ్గుతుందా? వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ నాణ్యతపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. దీని గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరు ఈ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచితే క్వాలిటీ తగ్గదనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఫీచర్ ఆన్ చేస్తే రెండు డివైజ్‌లు నేరుగా కనెక్ట్ కావు. కానీ సర్వర్ ద్వారా కాబట్టి కాల్ నాణ్యత కొంతమేరకు తగ్గవచ్చు.