Site icon HashtagU Telugu

Tech Tips: ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించాలి అనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

Tech Tips

Tech Tips

ప్రస్తుత రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ తప్పకుండా వినియోగిస్తున్నారు. వాట్సాప్ లేకుండా దాదాపు టచ్ మొబైల్స్ ఉండవు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. రోజురోజుకి ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. మామూలుగా చాలామంది వాట్సాప్,వాట్సాప్ బిజినెస్, జిబి వాట్సాప్ లను వినియోగిస్తూ ఉంటారు. ఒకే ఫోన్లో రెండు వేరువేరు నెంబర్ లతో వాట్సాప్ వినియోగించడం అన్నది సాధారణం.

కానీ తాజాగా ఒక కొత్త ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ట్రిక్‌ తో మీరు ఒకే ఫోన్‌ లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ఈ విధంగా మీరు మీ వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని వేరుగా ఉంచుకోవచ్చు. మీరు ఇందులో థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఈ ప్రత్యేక ఫీచర్‌ ని మీ వాట్సాప్‌ లో ఉపయోగించడమే. ముందుగా మీరు ఫోన్‌ లో మీ వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేసి, దానికి ముందు యాప్ తాజా వెర్షన్‌ కి అప్‌డేట్ చేయబడిందో లేదో చెక్ చేయాలి.

ఆపై ఫోన్ కుడివైపు ఎగువన ఉన్న 3 డాట్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు యాడెడ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మీ ప్రస్తుత వాట్సాప్ ఖాతా కూడా అక్కడ కనిపిస్తుంది. అందులో యాడ్ అకౌంట్ ఆప్షన్ + గుర్తుతో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫోన్ నంబర్‌ ను నిర్ధారించి, తదుపరి బటన్‌ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు మీ ఫోన్‌ లో మరొక వాట్సాప్‌ ని ఉపయోగించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీకు కావలసిన వాట్సాప్ ఖాతాని క్లిక్ చేయడం ద్వారా మీరు రెండు ఖాతాలలో ఒకదాన్ని ఉపయోగించవచ్చట.

ఇది ఒకే ఫోన్‌ లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫేసుబుక్ లేదా ఇంస్టాగ్రామ్ ఖాతాలను ఉపయోగించిన విధంగానే పని చేస్తుంది.
మరొక ఎంపిక కూడా ఉంది. దీని కోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌ లలో కొన్ని మార్పులు చేయాలి. మీరు మీ ఫోన్‌లో డ్యూయల్ యాప్‌ లు లేదా యాప్ క్లోన్‌ ని కలిగి ఉండాలి. ఇది వివిధ కంపెనీల ఫోన్‌ లలో వివిధ పేర్లతో వస్తుంది. ఏదైనా అప్లికేషన్ క్లోన్ లేదా డూప్లికేట్‌ని సృష్టించడం ఈ ఫీచర్ పని. మీరు నకిలీ అప్లికేషన్‌లో కొత్త ఖాతాను ఉపయోగించవచ్చట. దీని కోసం మీరు మీ ఫోన్‌ లోని డ్యూయల్ యాప్ లేదా యాప్ క్లోన్ ఫీచర్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు అనేక యాప్‌ల జాబితాను చూస్తారు. ఈ జాబితా నుండి వాట్సాప్ ని ఎంచుకుని, దానిని క్లోన్ చేయాలి. దీని తర్వాత దీన్ని ఇన్‌స్టాల్ చేయాలి. రెండవ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, దానిపై క్లిక్ చేయాలి. మీ రెండవ నంబర్‌ తో ఖాతాను సృష్టించండి. మీకు ఇప్పటికే ఖాతా ఉంటే, మీరు లాగిన్ అవ్వాలి. ఈ విధంగా, వాట్సాప్ ఖాతాలు ఫోన్‌ లోని రెండు నంబర్‌ ల నుండి పని చేయడం ప్రారంభిస్తాయట.