Apple Products For Rent : ఐఫోన్, ఐప్యాడ్ లు ఇకపై నెలవారీగా అద్దెకు..!!

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ...ఇదివరకే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+,ఐక్లౌడ్+వంటి ఎన్నో డిజిటల్ సబ్ స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - March 27, 2022 / 04:21 PM IST

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ …ఇదివరకే యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ+,ఐక్లౌడ్+వంటి ఎన్నో డిజిటల్ సబ్ స్క్రిప్షన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ లేటెస్టుగా హార్డ్ వేర్ సబ్ స్క్రిప్షన్ సర్వీసు పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్లు బయటకు వస్తున్న లీక్స్ ద్వారా తెలుస్తోంది. బ్లూమ్ బెర్ట్ రిపోర్టు ప్రకారం, యాపిల్ సంస్థ హార్డ్ వేర్ సబ్ స్క్రిప్షన్స్ లోకి అడుపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ఆ రిపోర్టు ప్రకారం యాపిల్ సంస్థ ప్రస్తుతం ఐఫోన్, ఇతర హార్డ్ వేర్ ప్రొడక్ట్స్ కోసం ఓ సబ్ స్క్రిప్షన్ సర్వీసుపై పనిచేస్తోంది. అంటే ఒక ఐఫోన్ వాడాలనుకున్నట్లయితే..దానిని కొనుగోలు చేసే బదులు జస్ట్ సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే…మీరు ఐఫోన్ ను ఒక నిర్దిష్ట సమయం వరకు లీజు లేదా రెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. ఆ సమయం వరకు సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించిన తర్వాత ఐఫోన్ ను రిటర్న్ చేస్తే సరిపోతుంది.

యాపిల్ సబ్ సబ్ స్క్రిప్షన్ లాంటి ఐఫోన్ అప్ గ్రేడ్ ప్రోగ్రాంను ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. ఇది పాత ఐఫోన్ వచ్చి…కొత్త ఫోన్ సొంతం చేసుకునేందుకు 12 నెలల వ్యవధిలో నెలకోసారి కొంత డబ్బును చెల్లించడానికి అనుమతిస్తుంది. అయితే ఈ ఇన్ స్టాల్ మెంట్ పద్దతి కాస్త వేరు. ఇప్పుడు యాపిల్ తీసుకురావాలని అనుకుంటున్న సర్వీసు వేరు. ఈ సర్వీసులో ఐఫోన్ ధరను విభజించి…నెలకు ఇంత కట్టాలని నిర్ణయించవచ్చని తెలుస్తోంది. బ్లూమ్ బెర్గ్ రిపోర్టు ప్రకారం..కొత్త సబ్ స్క్రిప్షన్ మోడల్ అందుబాటులోకి వచ్చినట్లయితే…ఇది ఆటోమేటిక్ గా రికరింగ్ సేల్స్ కు అదిపెద్ద ఫుష్ ఇచ్చినట్లవుతుంది. దీంతో యాపిల్ బాగా లాభపడే ఛాన్స్ కూడా లేకపోలేదు. అంతేకాదు వినియోగాదారులు మొదటిసారి హార్డ్ వేర్ ప్రొడక్ట్స్ కు సబ్ స్క్రిప్షన్ పొందేలా కూడా చేస్తుంది.

అయితే ఈ హార్డ్ వేర్ సబ్ స్క్రిప్షన్ ప్రాజెక్టు ఇంకా డెవలప్ స్టేజ్ లోనే ఉంది. సబ్ స్క్రిప్షన్ ఫీజు చెల్లించిన వినియోగదారులకు ఐఫోన్లు ఎలా డెలివరి చేస్తుంది. తిరిగి ఎలా కలెక్ట్ చేసుకుంటుందన్న విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సబ్ స్క్రిప్షన్ -బేస్డ్ ప్లాన్ ను తీసుకొచ్చినట్లయితే..కొంత ఫీజు చెల్లించి ఐఫోన్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే ఐఫోన్ ఒక్కసారాన్న వాడాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ వీటి ధర చాలా ఖరీదు కాబట్టి అందరికీ సాధ్య కాదు. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే ఐఫోన్ వాడేలా సబ్ స్క్రిప్షన్ సర్వీసు తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఐక్లౌడ్ లేదా యాపిల్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్ కోసం చెల్లించినంత ఈజీగా ఐఫోన్ లేదా ఐఫ్యాడ్ ను కొనుగోలు చేసే ప్రక్రియను తీసుకురావాలన్న ఆలోచనలో యాపిల్ ఉంది. యాప్స్ ను కొనుగోలు చేయడానికి…సేవలకు సబ్ స్క్రైబ్ చేయడానికి కస్టమర్స్ ఉపయోగించే అదే యాపిల్ ఐడీ, యాప్ స్టోర్ అకౌంట్ తో హార్డ్ వేర్ కు సబ్ స్క్రైబ్ అయ్యేలా యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు రిపోర్టు తెలిపింది. ఇక ఈ రిపోర్టు ప్రకారం సబ్ స్క్రిప్షన్ సర్వీసు 2022చివరి నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే 2023 లో ఈ సర్వీసు రోల్ అవుట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.