Site icon HashtagU Telugu

NRI Aadhaar Cards: ప్రవాస భారతీయులు ఇలా చేస్తే చాలు ఆధార్ కార్డును ఈజీగా పొందవచ్చు?

Mixcollage 11 Mar 2024 07 17 Pm 4766

Mixcollage 11 Mar 2024 07 17 Pm 4766

భారతదేశంలో ప్రతి ఒక్కరి గుర్తింపునకు ఆధార్ కార్డు ఎంతో కీలకం. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూఐడీఏఐ అందరికీ జారీ చేస్తోంది. అయితే మరి ప్రవాస భారతీయుల పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని వేడిస్తోంది. ఎన్ఆర్ ఐలు కూడా ఆధార్ కార్డును పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రత్యేక దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి. భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగిన ఎన్‌ఆర్‌ఐలు దేశానికి వచ్చిన తర్వాత ఆధార్‌ను పొందేందుకు అనుమతి ఉంది. విదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. అయినా వారు పొందే అవకాశం ఉంది.

దీనిని పొందడం వల్ల భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత లేదా బ్యాంకింగ్, ఆస్తి. అద్దె, ప్రభుత్వ లావాదేవీలు, ఎక్కువ కాలం బస చేయడం తదితర అనేక పనులకు ఉపయోగపడుతుంది. 2019 జూలై లో ఆధార్ చట్టానికి సవరణలు చేశారు. ఆ ప్రకారం భారతీయ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న ఎన్ఆర్ఐలు దేశానికి వచ్చిన తర్వాత ఆధార్ కార్డులను పొందవచ్చు. కార్డు కావాాలంటే 182 రోజుల పాటు దేశంలో నివసించాలన్న గత నిబంధనను తొలగించారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించింది. ఎన్ఆర్ఐ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త నమోదు ఫారాలను ప్రవేశపెట్టింది,ఎన్ఆర్ఐల కోసం దరఖాస్తు ఫారాలను సవరించారు. వాటిని నివాసితులు, ఎన్‌ఆర్‌ఐలకు వేర్వేరుగా కేటాయించారు.

పెద్దలు, పిల్లలు, విదేశీ పౌరుల కోసం నమోదు ఫారాలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియలో స్పష్ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. దేశంలో ఆధార్ కార్డునుm కోరుకునే ప్రవాస భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫారాలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రవేశపెట్టింది. ఇవి ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. ఫారం 1: 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న
వ్యక్తులకు, నివాసితులకు, భారతీయ చిరునామా రుజువు ఉన్న ఎన్ఆర్ఐలకు నిర్ధేశించారు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్‌లకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేకంగా దేశం వెలుపల చిరునామా రుజువుతో రూపొందించబడింది, నమోదు, నవీకరణలను దీని ద్వారా చేసుకోవచ్చు. ఐదేళ్ల నుంచి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు, నివాసితులు, భారతీయ చిరునామా రుజువున్న ఎన్ఆర్ఐల కోసం కేటాయించారు. భారతీయ చిరునామా రుజువు లేకుండా అదే వయసులో ఉన్న ఎన్ఆర్ఐ పిల్లల కోసం రూపొందించారు. భారతీయ చిరునామా రుజువుతో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న భారతీయ పిల్లల కోెసం తయారు చేశారు.

విదేశీ చిరునామా రుజువుతో ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న ఎన్ఆర్ఐ పిల్లల కోసం రూపొందించారు. రెసిడెంట్ విదేశీ పౌరుల కోసం తయారు చేశారు. 18 ఏళ్లు పైబడిన విదేశీ పౌరులకు ఉపయోగపడుతుంది. విదేశీ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, చెల్లుబాటు అయ్యే దీర్ఘకాల భారతీయ వీసా, నమోదు మరియు అప్‌డేట్‌ కోసం ఈమెయిల్ ఐడీ అవసరం. మైనర్ రెసిడెంట్ విదేశీ పౌరుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, వివరాల అప్‌డేట్ కోసం తయారు చేశారు. 18 ఏళ్లలోపు విదేశీ పౌరులకు ఉఫయోగపడుతుంది. ఫారం 9: 18 ఏళ్లు నిండిన వ్యక్తులందరూ తమ ఆధార్ నంబర్‌ను రద్దు చేసుకోవడానికి ఉద్దేశించబడింది.