Site icon HashtagU Telugu

Aadhaar Card: ఎమర్జెన్సీ లోన్ కావాలా.. అయితే ఆధార్ ఒక్కటి ఉంటే చాలు.. అదెలా అంటే!

Aadhaar Card

Aadhaar Card

మామూలుగా మనకు కొన్ని కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితులలో డబ్బు చేతిలో లేనప్పుడు ఇతరులను అప్పు అడగడం లేదంటే మన వద్ద ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మంది ఇంటి పత్రాలు లేదంటే బంగారు ఆభరణాలు వంటివి బ్యాంకులలో తాకట్టుపెట్టి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అవి కూడా లేనప్పుడు ఏం చేయాలో తెలియక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ వార్త. ఆధార్ కార్డుతో పదివేల రూపాయలు లోన్ తీసుకోవచ్చట. ఆ తీసుకున్న డబ్బుని ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్ చెల్లించవచ్చని చెబుతున్నారు.

అంతేకాకుండా ఈ పదివేల రుణానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదట. మరి ఆధార్ కార్డుతో రూ.10,000 ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఆధార్ కార్డుపై లభించే రూ.10,000 రుణాన్ని పర్సనల్ లోన్ అంటారు. ఈ లోన్ కోసం ఎలాంటి వ్యక్తిగత పత్రాలను అడగరు. కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించాలి. ఆ వెంటనే రూ.10,000 మీ ఖాతాకు బదిలీ అవుతాయి. మీరు ఆధార్‌తో పాటు పాన్ కార్డును కూడా ఉపయోగిస్తే, అధిక మొత్తంలో రుణాన్ని కూడా పొందవచ్చు. ప్రభుత్వ బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందించడం చాలా తక్కువ. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డును ఉపయోగిస్తే, ప్రైవేట్ బ్యాంకులు సులభంగా వ్యక్తిగత రుణాలను ఇస్తాయి.

మీకు పాన్ కార్డ్ లేకపోతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ ఫారమ్‌ ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చట. మీకు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిలో మీరు NBFC ఫిన్‌టెక్ ప్లాట్‌ ఫారమ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ ని సందర్శించాలి. ఆధార్ కార్డు, అవసరమైన వివరాలను అందించడం ద్వారా మీరు సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ సాయంతో, 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం లేదా సొంత వ్యాపారం ఉన్న వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు యాక్టివ్ బ్యాంక్ ఖాతాను కూడా కలిగి ఉండాలి. మరిన్నీ సమాచారాల కోసం వెంటనే వెబ్ సైట్ ని సందర్శించాలి.