Android smartphone: స్మార్ట్ ఫోన్లో స్టోరేజ్ స్పేస్ ను ఫ్రీ చేసుకోవడం ఇలా…

మీ స్మార్ట్ ఫోన్లో స్పేస్ నిండు కుంటోందా? 64 జీబీ స్టోరేజీ కూడా ఇట్టే ఫుల్ అయిపోతోందా ?

  • Written By:
  • Publish Date - May 27, 2022 / 09:00 PM IST

మీ స్మార్ట్ ఫోన్లో స్పేస్ నిండు కుంటోందా? 64 జీబీ స్టోరేజీ కూడా ఇట్టే ఫుల్ అయిపోతోందా ? ఈ సమస్యను అధిగమించేందుకు, స్టోరేజ్ స్పేస్ ను ఆదా చేసుకునేందుకు ఏం చేయాలనేది తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే. మొబైల్ యాప్స్ సంఖ్య 40కి మించినా.. గేమింగ్ సాఫ్ట్ వేర్ లు పరిమితికి మించి డౌన్ లోడ్ చేసినా స్టోరేజ్ చాలా త్వరగా నిండుకుంటుంది. ఇటువంటి సమయంలో తొలుత చేయాల్సిన పని.. అనవసరమైన యాప్స్ ను, వీడియోలను, ఫోటోలను, గేమ్ లను డిలీట్ చేయడం!!

వాట్సాప్ లో..

వాట్సాప్ లో పేరుకుపోయిన కచరాను కూడా తీసేయండి. ఇందుకోసం వాట్సాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి, స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దీంతో మేనేజ్ స్టోరేజ్ అనే ఆప్షన్ తెరుచుకుంటుంది. ఇందులో మీకు ఫైల్స్, వాటి సైజుల వివరాలు కనిపిస్తాయి. 5 ఎంబీ కంటే ఎక్కువ సైజున్న ఫైల్ లను ముందుగా డిలీట్ చేసేయండి. మీరు చాట్ సెక్షన్ లోకి వెళ్లి.. ఒక్కో చాట్ ను కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పద్ధతిలో ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయడం కష్టం అనిపిస్తే .. నేరుగా ఫోటో గ్యాలరీని ఓపెన్ చేయండి. అందులో ఫోటోలు, వీడియోలను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయొచ్చు. ఇలా ఫోటోలను డిలీట్ చేసే క్రమంలో బ్యాకప్ చేసుకోవడం మరువొద్దు. ఇందుకోసం గూగుల్ ఫోటోస్ యాప్ ను వాడొచ్చు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. గూగుల్ ఫోటోస్ లో వీడియోలు, ఫోటోలన్నీ బ్యాకప్ అవుతాయి. మీరు డిలీట్ చేసిన వాటిలో ఏదైనా ముఖ్యమైనది ఉందని భావిస్తే.. గూగుల్ ఫోటోస్ లోకి వెళ్లి మళ్లీ పొందొచ్చు. బ్యాకప్ ఆప్షన్ ఆన్ కావాలంటే.. గూగుల్ ఫోటోస్ యాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాకప్ సెక్షన్ ను ఎనేబుల్ చేయాలి. మీ జీమెయిల్ ఖాతా ద్వారా గూగుల్ ఫోటోస్ యాప్ లోకి లాగిన్ అయి.. బ్యాకప్ ను పొందొచ్చు.

ఆర్కైవ్ చేసే ఆప్షన్​..

ఆండ్రాయిడ్​ త్వరలో యాప్‌లను ఆర్కైవ్ చేసే ఆప్షన్​ను పరిచయం చేయనుంది. ఇది యాప్‌లోని డేటాను కుదిస్తుంది. ఎప్పుడూ యాప్​ల కోసం కొంత స్టోరేజ్​ను మిగిలే ఉంచుతుంది. అయితే, ఈ ఫీచర్​కు గూగుల్ ఇంకా పేరు పెట్టలేదు. కానీ, ఈ ఫీచర్​ను ఈ ఏడాది చివర్లో ఆండ్రాయిడ్ 13 లేటెస్ట్​ వెర్షన్​ ద్వారా అందు బాటులోకి తీసుకు రానున్నట్లు స్పష్టం చేసింది.