Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ప్రైవేట్‌ చాట్‌లకి మరింత భద్రత?

Mixcollage 01 Feb 2024 03 27 Pm 229

Mixcollage 01 Feb 2024 03 27 Pm 229

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

కాగా సెక్యూరిటీ, ప్రైవసీ, డిజైన్‌, పర్ఫార్మెన్స్‌ పరంగా తరచూ లేటెస్ట్‌ ఫీచర్ లను ఏం చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. అయితే వాస్తవానికి ఇంతకుముందే వాట్సాప్‌ తన యూజర్లకు ప్రైవేట్‌ చాట్‌ లను ఫింగర్‌ప్రింట్‌తో లాక్ చేసుకునే సదుపాయం కల్పించింది. అయతే ఇది ఫోన్‌ని అన్‌లాక్‌ చేయడానికి యూజ్‌ చేసే ఫింగర్‌ప్రింట్‌ అథెంటికేషన్‌ పైనే ఆధారపడుతుంది. అంటే ఎవరైనా డివైజ్‌లో ఫింగర్‌ప్రింట్‌ని రిజిస్టర్ చేసుకోగలిగితే, వారు యూజర్ ప్రైవేట్ వాట్సాప్‌ చాట్‌లకు కూడా యాక్సెస్‌ పొందవచ్చు. ఈ సమస్యను గుర్తించిన వాట్సాప్ కంపెనీ, అదనపు భద్రత కోసం సీక్రెట్‌ కోడ్ ఫీచర్‌ను గత నెలలో ప్రవేశపెట్టింది.

సీక్రెట్‌ కోడ్‌ ఫీచర్ చాట్‌లను సురక్షితంగా ఉంచుతుంది. ముఖ్యంగా మీ ఫోన్‌కి ఎవరైనా యాక్సెస్ కలిగి ఉన్నా లేదా మీరు ఇతరులతో షేర్‌ చేసుకున్నా వాట్సాప్‌ ప్రైవేట్‌ చాట్‌లను చూడలేరు. అలాగే సీక్రెట్ కోడ్ ఫీచర్ ద్వారా మీరు చాట్‌లకు అదనపు ప్రైవసీ లేయర్‌ యాడ్‌ చేయవచ్చు. ఫోన్ అన్‌లాక్ కోడ్‌ కాకుండా ప్రత్యేక పాస్‌వర్డ్‌ను సెట్ చేయవచ్చు. చాట్ లాక్ సెట్టింగ్స్‌లో హైడ్‌ లాక్డ్‌ చాట్స్‌ ఆప్షన్‌ యాక్టివేట్ చేస్తే, చాట్ లిస్ట్ నుంచి ప్రైవేట్‌ చాట్‌లు డిసప్పియర్‌ అవుతాయి. మళ్లీ యాక్సెస్ చేయడానికి, సెర్చ్ బార్‌లో సెట్‌ చేసిన సీక్రెట్‌ కోడ్‌ ఎంటర్‌ చేస్తే సరిపోతుంది. అవి చాట్ లిస్ట్‌లో కనిపించేలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త చాట్‌ని లాక్ చేయడం చాలా ఈజీ సెట్టింగ్స్‌ వరకు వెళ్లకుండా లాంగ్ ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. మీరు ఫింగర్‌ ప్రింట్‌ లేదా ఫేస్ అన్‌లాక్‌ని యూజ్‌ చేయలేకపోతే వాట్సాప్‌ చాట్‌లను అన్‌లాక్ చేయడానికి ఈ సీక్రెట్‌ కోడ్ ప్రత్యామ్నాయంగా కూడా పని చేస్తుంది. మరి వాట్సాప్ చాట్లను ఎలా లాక్ చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, మీరు లాక్ చేయాలనుకుంటున్న చాట్‌పై లాంగ్ ప్రెస్‌ చేయండి.

టాప్‌ రైట్‌లో ఉన్న త్రీ డాట్స్‌పై క్లిక్‌ చేయండి లాక్ చాట్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేసి, ఫింగర్‌ప్రింట్‌ లేదా ఫేస్‌ అన్‌లాక్‌ యూజ్‌ చేసి అథెంటికేట్‌ చేయాలి. మీ చాట్‌లు ఇప్పుడు లాక్‌ అవుతాయి. వాటిని ఓపెన్‌ చేయడానికి చాట్స్ ట్యాబ్‌పై పైకి స్వైప్ చేసి, లాక్డ్‌ చాట్స్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. అదేవిధంగా సీక్రెట్‌ కోడ్‌ను ఎలా క్రియేట్ చేయాలి? ముందుగా లాక్డ్ చాట్స్ విండోకు వెళ్లి సీక్రెట్ కోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కోడ్‌ను క్రియేట్‌ చేయడానికి వాట్సాప్‌ మీకు గైడెన్స్ అందిస్తుంది. కోడ్ ఎమోజి కావచ్చు లేదా కనీసం నాలుగు అక్షరాలతో కూడిన వర్డ్‌ కావచ్చు. సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత ఓకే బటన్‌పై ట్యాప్‌ చేస్తే సీక్రెట్‌ కోడ్‌ క్రియేట్ అవుతుంది.