Site icon HashtagU Telugu

Google People Card : గూగుల్ పీపుల్ కార్డ్.. మీ గురించి మీరు చెప్పుకోవడానికి..

How to Create Google People Card for our Self Promotion in Internet

How to Create Google People Card for our Self Promotion in Internet

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మన ప్రతిభను మనం ఎగ్జిబిట్ చేసుకోకపోతే ఉపయోగం ఉండదు. ఎదిగే క్రమంలో మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సిందే. సమాచారం తెలుసుకోవడానికి అందరం గూగుల్(Google) పైనే ఆధారపడతాం. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే ఎంత బాగుంటుందో కదా. అలా కోరుకొనే వారి కోసమే గూగుల్ ఒక ప్రత్యేకమైన ఫీచర్ను తీసుకొచ్చింది.

దాని పేరే పీపుల్ కార్డు (People Card). గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో మనకు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖంగా చూపటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి ఇది భారత్ తో పాటు కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ లోనే కాదు హిందీ భాషలో కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఎలా రూపొందించుకోవాలి అనే కదా మీ అనుమానం.. చాలా సింపుల్..

ముందుగా స్మార్ట్ ఫోన్లో గూగుల్ యాప్ ని ఓపెన్ చేసి “యాడ్ మీ టు సెర్చ్” అని టైప్ చేయాలి. వెంటనే “ఆడ్ యువర్ సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్” విండో ఓపెన్ అవుతుంది. అందులోకి వెళ్లి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక ఇప్పుడు మీ వ్యక్తిగత వివరాలైన పేరు, ప్రాంతం, ఉద్యోగం లేదా బిజినెస్, చదువు, ఈమెయిల్, వెబ్సైట్ లాంటివన్నీ ఫిల్ చేయాలి. కావాలనుకుంటే మీ సోషల్ మీడియా అకౌంట్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక కాంటాక్ట్ వివరాలు చూపించాలా వద్దా అన్నది కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ సెలెక్ట్ చేసి వివరాలు చెక్ చేసుకోవచ్చు. తర్వాత కార్డును సేవ్ చేసుకుంటే చాలు. మన పేరుతో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ పీపుల్ కార్డ్ ఆన్లైన్లో కనిపిస్తుంది. బాగుంది కదూ.. అయితే ట్రై చెయ్యండి మరి.

 

Also Read : Zimbabwe T10 League: వచ్చేసింది మరో టీ10 లీగ్