Site icon HashtagU Telugu

5G Phone: మీ ఫోన్ 5జీని సపోర్ట్ చేస్తుందా?

5G Spectrum Auction

5G Spectrum Auction

5జీ ఇంటర్నెట్.. 4జీ కంటే 10 రెట్లు ఎక్కువ వేగం.

దీనికి సంబంధించిన సేవలు త్వరలోనే దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తొలి విడతగా అందుబాటులోకి రానున్నాయి.

జియో, ఎయిర్ టెల్ నుంచి తొలుత 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

రియల్ మీ, శావో మీ వంటి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల నుంచి విస్తృత సంఖ్యలో 5జీ ఫోన్స్ ఇప్పటికే విడుదల అయ్యాయి. రూ.10వేల లోపు రేటుకు కూడా 5జీకి సరిపోయే స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి.

ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనే ముందు.. అది 5జీకి సపోర్ట్ చేస్తుందా? చేయదా? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం మీరు 5 టిప్స్ కావాల్సి ఉంటుంది..

* మీ ఫోన్ లో సెట్టింగ్స్ ఆప్షన్ ను క్లిక్ చేయండి.
* దాని తర్వాత వై ఫై అండ్ నెట్ వర్క్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి..
* ఇలా వై ఫై అండ్ నెట్ వర్క్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయగానే.. సిమ్ అండ్ నెట్ వర్క్ అనే మరో ఆప్షన్ తెరుచుకుంటుంది.

* చివరకు ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఒకవేళ మీ ఫోన్ 5జీని సపోర్ట్ చేసేదే అయితే.. 2జి, 3జి, 4జి, 5జి సపోర్ట్ అనే ఆప్షన్ ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

* మీకు త్వరగా 5జీ ఫోన్ కావాలా ? అయితే ఈవిధంగా సెటింగ్స్ లో చెక్ చేసుకొని 5జీ ఫోన్ ను కొనండి.

* మీరు సిమ్ వాడుతున్న టెలికాం కంపెనీ 5జి సేవలను స్టార్ట్ చేయకముందే .. 5జి ఫోన్ ను కొనొద్దు. ఒకవేళ అలా కొంటె ఆ ఫోన్ 5జి ని సపోర్ట్ చేయదు.

హైదరాబాద్‌ సహా 13 ప్రధాన నగరాల్లో ..

తొలి దశలో హైదరాబాద్‌ సహా 13 ప్రధాన నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5జి రేడియో తరంగాల విక్రయం ఇప్పటికే పూర్తయ్యింది. ఈ కొత్తతరం సాంకేతికత అందుబాటులోకి వస్తే 4జి కన్నా పదిరెట్ల వేగంతో సేవలు అందుతాయి. మొదట్లో ఆగస్టు 15నుంచి 5జి సేవలు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ అలా జరగలేదు. దాదాపు సెప్టెంబర్‌ నెలలో అది సాధ్యం కావొచ్చు. దేశంలో 4జి సేవలు అందుబాటులోకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో లభించడం లేదు. నిన్నగాక మొన్న లఢక్‌ ప్రాంతంలో తొలిసారిగా 4జి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 5జి సేవలు అందుబాటులోకి వచ్చినా తొలి దశలో కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. ఆ తరువాత దశలవారీగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు.

వివో 5జి ఫోన్ లాంచ్..

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్  వివో (Vivo)కొత్త కెమెరా ఫోన్ Vivo V25 Pro 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. Vivo V23 Pro తరువాత Vivo V25 ప్రోని  తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ ఉంది. అలాగే ఫోన్ బ్లాక్ అండ్ సెయిలింగ్ బ్లూ కలర్‌లో కలర్ మారుతున్న బ్యాక్ ప్యానెల్‌తో పరిచయం చేసారు. ఫోన్ 6.53-అంగుళాల 3D కర్వ్డ్ స్క్రీన్‌ ఉంది. ఈ ఫోన్ 128జి‌బి  స్టోరేజ్ 8 జి‌బి ర్యామ్ ధర రూ. 35,999, 12 జి‌బి ర్యామ్ 256 జి‌బి స్టోరేజ్ ధర రూ. 39,999.